జన్యుశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
==పదకోశం==
*[[ '''అనువంశికత]]''' (Heredity): జనకతరంలోని లక్షణాలు పిల్ల తరానికి అందజేయడం లేదా సంక్రమించడం.
* '''జనకతరం''': సంకరణంలో పాల్గొనే జీవులు. దీన్ని 'P' తో సూచిస్తారు.
* '''సంతతి''': ఇవి జీవుల సంయోగంలో ఏర్పడిన జీవులు. దీన్ని పిల్లతరం అని కూడా అంటారు. మొదటి పిల్ల తరాన్ని 'F<sub>1</sub>', రెండో తరాన్ని 'F<sub>2</sub>' తో సూచిస్తారు.
* '''వైవిధ్యాలు''': జనకులకు, సంతతి లక్షణాలకు మధ్య భేదాలను వైదిధ్యాలు అంటారు.
* '''దృశ్యరూపం''' (Phenotype): జీవులు బహిర్గతం చేసే నిర్ధిష్ట లక్షణాలన్నింటిని దృశ్యరూపం అంటారు.
* '''జన్యురూపం''' (Genotype): జీవిలోని జన్యువులే జన్యురూపం.
* '''సంకరణం''': కనీసం ఒక జత వేర్వేరు లక్షణాలున్న ఒకే జాతికి చెందిన రెండు మొక్కల మధ్య సంయోగాన్ని సంకరణం అంటారు. దీన్ని 'X' తో సూచిస్తారు.
* '''సమయుగ్మజం''': ఒక లక్షణాన్ని సూచించడానికి ఒక జత యుగ్మ వికల్పాలలోని ఏదైనా ఒక దాన్ని 2 మాత్రల్లో కలిగివుంటే ఆ జీవిని ఆ లక్షణానికి సంబంధించి సమయుగ్మజం అంటారు. ఉదా: TT, tt - సమయుగ్మజ పొడవు
* '''విషమ యుగ్మజం''': ఒక లక్షణాన్ని సూచించడానికి ఒక జత యుగ్మ వికల్పాలలోని రెండింటినీ కలిగివుంటే, ఆ జీవిని ఆ లక్షణానికి సంబంధించి విషమ యుగ్మజం అంటారు. ఉదా: Tt - విషమయుగ్మజ పొడవు
* '''యుగ్మ వికల్పాలు''': రెండు సమజాత క్రోమోజోముల్లోని ఎదురెదురు లోకస్ లలో ఉండే రెండు జన్యువులు ఒక జత లక్షణాలను సూచిస్తే వాటిని యుగ్మ వికల్పాలు అంటారు. ఉదా: T మరియు t యుగ్మ వికల్పాలు పొడవు, పొట్టి అనే ఒక జత లక్షణాలను సూచిస్తాయి.
* '''బహిర్గత జన్యువు''': ఒక జన్యువు తన యుగ్మ వికల్ప సమక్షంలో కూడా తన లక్షణాన్ని కనబరిస్తే, దాన్ని బహిర్గత జన్యువు అంటారు. ఉదా: T t = పొడవు. దీనిలో T తన యుగ్మ వికల్పమైన t సమక్షంలో తన లక్షణాన్ని కనబరుస్తుంది.
* '''అంతర్గత జన్యువు''': ఒక జన్యువు రెండు మాత్రల్లో ఉన్నప్పుడు లేదా తన యుగ్మ వికల్పం లేనప్పుడు తన లక్షణాన్ని ప్రదర్శిస్తే దాన్ని అంతర్గత జన్యువు అంటారు. ఉదా: t t = పొట్టి. ఇక్కడ t రెండు మాత్రల్లో ఉండి తన యుగ్మ వికల్పం T లేనప్పుడు తన లక్షణాన్ని ప్రదర్శిస్తుంది.
* '''[[సంకరం]]''' (Hybrid): సంకరణంలో ఏర్పడిన మొక్కను లేదా జంతువును సంకరం అంటారు. ఇది విషమ యుగ్మజం.
* '''ఏక సంకర సంకరణం''': ఒక జత వేర్వేరు లక్షణాలు ఉన్న ఒకే జాతికి చెందిన రెండు జీవుల మధ్య సంయోగాన్ని ఏకసంకరణం అంటారు.
*ఏక సంకర సంకరణం:
* '''ద్విసంకర సంకరణం''' (Dihybrid): రెండు జతల వేర్వేరు లక్షణాలు ఉన్న ఒకే జాతికి చెందిన రెండు జీవుల మధ్య సంయోగాన్ని ద్విసంకరణం అంటారు.
*ద్విసంకర సంకరణం (Dihybrid):
* '''వ్యతిరేక వైవిధ్యాలు''': ఒకే లక్షణానికి చెందిన రెండు భిన్న రూపాలను వ్యతిరేక వైవిధ్యాలు అంటారు. ఉదా: పొడవు, పొట్టి అనేది ఒక లక్షణానికి చెందిన రెండు భిన్న రూపాలు.
*వ్యతిరేక వైవిధ్యాలు:
*మెండేలియన్ అనువంశిక సూత్రాలు:
* '''సహలగ్నత''': ఒక క్రోమోజోములో రెండు లేదా అంతకంటే జన్యువులు కలిసి ఉండటాన్ని సహలగ్నత అంటారు.
*పరీక్షా సంకరణం:
*సహలగ్నత:
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జన్యుశాస్త్రం" నుండి వెలికితీశారు