"అణుపుంజము" కూర్పుల మధ్య తేడాలు

 
*'''రేఖీయ పాలిమర్లు''': మోనోమర్ యూనిట్లన్నీ ఒక దానితో ఒకటి కలిసి పొడవైన శృంఖలాలుగా ఉంటే వాటిని రేఖీయ పాలిమర్లు అంటారు. వీటిలో అణువులు ఒకదానితో ఒకటి సన్నిహితంగా బంధితమై ఉంటాయి. అందువలన వీటికి అధిక సాంధ్రత, బాష్పీభవన, ద్రవీభవన స్థానాలుంటాయి. ఉదా: పాలిథిన్, నైలాన్, పాలిఎస్టర్
 
 
*'''శాఖీయ పాలిమర్లు''': మోనోమర్ శృంఖలాల్లో శాఖలుంటే వాటిని శాఖీయ పాలిమర్లు (Branched polymers) అంటారు. ఇవి రేఖీయ పాలిమర్లంత సన్నిహితంగా బంధితమై ఉండలేవు. కాబట్టి వీటి సాంధ్రత, ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు తక్కువగా ఉంటాయి. ఉదా: అమైలో పెక్టిన్, స్టార్చ్, గ్లైకోజెన్
 
 
*'''క్రాస్ లింక్ డ్ పాలిమర్లు''': మోనోమర్లు త్రిమితీయంగా, పటిష్టమైన జాలక నిర్మాణాన్ని ఏర్పరిస్తే వాటిని క్రాస్ లింక్ డ్ పాలిమర్లు (Cross-linked polymers) అంటారు. ఇవి పెళుసుగా, ధృఢ స్వభావంతో ఉంటాయి. ఉదా: బేకలైట్, మెలమైన్
 
 
; పాలిమర్లు తయారయ్యే పద్ధతిని బట్టి.
*'''సంకలన పాలిమర్లు''': చర్యలో ఎలాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరచకుండా మోనోమర్లు పునరావృతమవుతూ ఏర్పడే పాలిమర్లను సంకలన పాలిమర్లు అంటారు. ఉదా: ఇథిలీన్ నుండి పాలిథిన్; స్టైరీన్ నుండి పాలిస్టైరీన్
 
*'''సంఘలన పాలిమర్లు''': నీరు, అమ్మోనియా, ఆల్కహాల్ లాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరుస్తూ, మోనోమర్లు కలిసి పాలిమర్ ఏర్పడితే దాన్ని సంఘనన పాలిమర్లు అంటారు.
 
; పాలిమర్ అణువుల మధ్య ఉండే బంధణాల దృఢత్వాన్ని బట్టి
 
పాలిమర్ అణువుల మధ్య వుండే [[వాండర్ వాల్ ఆకర్షణ]]లు, [[హైడ్రోజన్]] బంధాలు వాటి ధృఢత్వానికి, [[స్థితిస్థాపకత]]కు కారణమవుతాయి. ఈ బలాల పరిమాణాన్ని బట్టి పాలిమర్లను ఎలాస్టోమర్లు, ఫైబర్లు, థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ గా వర్గీకరించారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/395776" నుండి వెలికితీశారు