అణుపుంజము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
*'''సంకలన పాలిమర్లు''': చర్యలో ఎలాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరచకుండా మోనోమర్లు పునరావృతమవుతూ ఏర్పడే పాలిమర్లను సంకలన పాలిమర్లు అంటారు. ఉదా: ఇథిలీన్ నుండి పాలిథిన్; స్టైరీన్ నుండి పాలిస్టైరీన్
 
 
*'''సంఘలన పాలిమర్లు''': నీరు, అమ్మోనియా, ఆల్కహాల్ లాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరుస్తూ, మోనోమర్లు కలిసి పాలిమర్ ఏర్పడితే దాన్ని సంఘనన పాలిమర్లు అంటారు.
 
 
; పాలిమర్ అణువుల మధ్య ఉండే బంధణాల దృఢత్వాన్ని బట్టి
 
పాలిమర్ అణువుల మధ్య వుండే [[వాండర్ వాల్ ఆకర్షణ]]లు, [[హైడ్రోజన్]] బంధాలు వాటి ధృఢత్వానికి, [[స్థితిస్థాపకత]]కు కారణమవుతాయి. ఈ బలాల పరిమాణాన్ని బట్టి పాలిమర్లను ఎలాస్టోమర్లు, ఫైబర్లు, థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ గా వర్గీకరించారు.
 
 
* '''ఎలాస్టోమర్లు''' : పాలిమర్ అణువుల మధ్య బలాలు చాలా బలహీనంగా ఉండడం వలన వాటిపై కొద్దిపాటి ఒత్తిడి కలిగించినా గాని అవి సాగిపోతాయి. ఒత్తిడిని తొలగించగానే యధారూపానికి వస్తాయి. సహజ రబ్బర్ ఇందుకు ఒక ఉదాహరణ.
 
* '''ఫైబర్లు''' : పాలిమర్ అణువుల మధ్య హైడ్రోజన్ బంధాలున్నట్లయితే అవి ఫైబర్ల రూపంలో ఉంటాయి. నైలాన్ 6, 6 టెర్లిన్, పాలీఎక్రైలోనైట్రేల్ వంటివి ఈ కోవకు చెందుతాయి.
* '''థర్మోప్లాస్టిక్కులు''' : ఇవి వేడి చేసినపుడు మృదువుగా అయ్యి తరువాత యధాస్థితికి వస్తాయి. ఇవి పొడవైన రేఖీయ పాలిమర్లు. సంకలన పాలిమరైజేషన్ ఫలితంగా ఏర్పడతాయి. వీటిలో పెళుసుదనం తక్కువ.
 
* '''థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కులు''' : ఇవి వేడి చేసినపుడు మృదువుగా మారవు (మెత్తబడవు). ఒకవేళ బాగా వేడిచేసినపుడు ద్రవస్థితికి వస్తాయి గాని మళ్ళీ చల్లారినపుడు యధాస్థితికి రావు. ఇవి క్రాస్ లింకింగ్‌తో ఉండే పాలిమర్లు. దృఢంగా, పెళుసుగా ఉంటాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అణుపుంజము" నుండి వెలికితీశారు