వరుణ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
===వ్యక్తిగత రాజకీయాలు===
[[2004]] సార్వత్రిక ఎన్నికలలోనే పోటీకి ఆసక్తి చూపిననూ వయస్సు అడ్డంకి రావడంతో విరమించుకున్నాడు. కాని దృష్టి మాత్రం రాజకీయాలపైనే సాగించాడు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించి పలు సమావేశాలలో, పార్టీ మీటింగులలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే భాజపా కార్యనిర్వాహక సభ్యుడిగా నియమించబడ్డాడు. అప్పుడు తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి వెళ్ళి ప్రజల పరిస్థితిని, కష్టాలను ప్రత్యక్షంగా గమనించాడు. ప్రజల కష్టలు పరిశీలించి వారికి అప్పటికప్పుడు సహాయం కూడా చేశాడు. ఇవన్నీ రాజకీయంగా అతని ఎదుగుదలకు దోహదపడింది. [[2006]] లో [[మధ్య ప్రదేశ్]] లోని విదిశా లోకసభ ఉప ఎన్నికలలో పార్టీ టికెట్టు కోసం ప్రయత్నించిననూ లభించినట్టే లభించి చివరి క్షణంలో దూరమైంది. <ref>[http://www.hindu.com/2006/10/07/stories/2006100706301200.htm హిందూ ఆన్‌లైన్ ఎడిషన్ తేది 07-10-2006]</ref>2009 ఎన్నికలకై ఇదివరకు అతని తల్లి మేనక్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఫిలిబత్ లోకసభ స్థానంలో పోటీచేయడానికి పార్టీ టికెట్టు కూడా పొందినాడు. [[మార్చి 5]]న ఎన్నికల ప్రసంగంలో మతపరమైన ఉద్రేక ప్రసంగాలు చేసినందుకు ఎన్నికల కమీషన్ లోకసభ ఎన్నికలలో పోటీచేయడానికి అనర్హత విధించింది. వరుణ్‌కు పార్టీ టికెట్టు ఇవ్వరాదని భారతీయ జనతా పార్టీని ఆదేశించింది<ref>ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009</ref>
 
==ఇటీవలి పరిణామాలు==
మార్చి 5వ తేదీన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ మతపరంగా ఉద్రేక ప్రసంగాలు చేసినట్లు ప్రచారం కావడంతో ఎన్నికల కమీషన్ వరుణ్ గాంధీ ఎన్నికలలో పోటీ చేయరాదని ఆంక్షలు విధించింది. అయితే ఇది రాజకీయంగా తనను ఇరకాటంలో పెట్టేందుకు కుట్రమాత్రమేనని, తాను ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేనని, దీనికి సంబంధించి ఎటువంటి క్షమాపణలు చెప్పే ప్రశక్తే లేదని స్పష్టం చేశాడు. పిలిభిత్‌లో హిందువులు భయంతో బతుకున్నారు. ఓ బ్లాకులో మూడు ఆలయాలను ధ్వంసం చేశారు. అందువలనే ఈ వర్గ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలనుకున్నట్లు చెప్పినాడు.<ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/18/1090318029_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 18-03-2009]</ref> ఈ విషయంలో పరిస్థితి విషమించడంతో ముందస్తు బెయిల్‌కై ప్రయత్నించగా ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరి చేసింది. <ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/20/1090320021_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 20-03-2009]</ref> వరుణ్ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా ముందు వెనుకంజ వేసి తర్వాత వరుణ్ తప్పు లేనట్లు ప్రకటించింది. ప్రారంభంలో భాజపా నాయకత్వం వరుణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.<ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/17/1090317007_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 17-03-2009]</ref> ఈ విషయంలో [[శివసేన పార్టీ]] అధినేత [[బాల్ థాకరే]] ఒక అడుగు ముందు వేసి వరుణ్ గాంధీ మాటలలో తప్పేమీ లేదని ప్రకటించాడు. <ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/18/1090318031_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 18-03-2009]</ref> తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.ను తొలిగించాలని వరుణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాదు హైకోర్టు తోసిపుచ్చింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> <ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/25/1090325023_1.htm యాహూ తెలుగు వార్తలు తేది. 25-03-2009]</ref>
"https://te.wikipedia.org/wiki/వరుణ్_గాంధీ" నుండి వెలికితీశారు