బసవరాజు అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

తెలుగు రచయిత, కవి
చి బసవరాజు అప్పారావు
(తేడా లేదు)

16:52, 29 మార్చి 2009 నాటి కూర్పు

బసవరాజు అప్పారావు విజయవాడ సమీపంలోని పటమట గ్రామంలో, 13 - 12 - 1894 న జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో

బి.ఏ. పాసైనాడు. 1916లో రాజ్యలక్ష్మమ్మను సౌదామిని వివాహం చేసుకొన్నాడు. గాంధీ ఉద్యమంతో సంబంధం పెట్టుకొని, జాతీయగీతాలు వ్రాశాడు. 1921 ప్రాంతంలో ఆంధ్రపత్రిక , భారతికి సహాయ సంపాదకుడుగా పనిచేశాడు. బసవరాజు అప్పారావు , దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావులు "భావకవులు" అనబడేవారు ఆ కాలంలో. అప్పారావు సరళ శైలిలో గీతాలు వ్రాస్తే , నండూరి జానపద శైలిలో గేయాలు వ్రాసేవాడు.అందుకే దేవులపల్లి ఇలా అన్నాడు. "సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం"అని. అప్పారావు వ్రాసిన పాటలను గూడవల్లి రామబ్రహ్మం తన సినిమా మాలపిల్లలో(1938) పరిచయం చేశాడు.సూరిబాబు పాడిన "కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి మాలడై తిరిగితేనేమి?" అప్పట్లో ప్రతి గొంతుకలో మారుమ్రోగింది. కాంచనమాల సుందరమ్మలు పాడిన "నల్లవాడే గొల్లపిల్లవాడే" చాలా ప్రాచుర్యం పొందిన పాట. "గుత్తొంకాయ్ కూరోయ్ బావా, కూరి వండినానోయ్ బావా" అనే పాటను బందా కనకలింగేశ్వరరావు పాడాడు. తాజ్‌మహల్ను దర్శించినప్పుడే, "మామిడి చెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి" అనే పాటను రాశాడు. ఆయన వ్రాసిన లలితగీతాలను టంగుటూరి సూర్యకుమారి, బాల మురళీకృష్ణ, రావు బాలసరస్వతీ దేవి మధురంగా పాడారు.అప్పారావు 1933 లోమరణించాడు.