వరుణ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ml:വരുണ്‍ ഗാന്ധി
+ తాజా సమాచారం
పంక్తి 7:
| marital status =అవివాహితుడు
| Official Status =భాజపా కార్యనిర్వాహక సభ్యుడు.
| constituency = ఫిలిబత్ఫిలిభిత్
| office =
| salary =
పంక్తి 21:
| source =
}}
[[భారతీయ జనతా పార్టీ]] యువ నేతలలో ముఖ్యుడైన వరుణ్ గాంధీ (Varun Gandhi) [[1980]], [[మార్చి 13]]న జన్మించాడు. [[భారత్|భారతదేశం]]లో చారిత్రకంగా, రాజకీయంగా ప్రముఖమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్ తను మూడు నెలల వయసు ఉన్నప్పుడే తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు నానమ్మ, భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన [[ఇందిరా గాంధీ]] మరణించింది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇప్పటివరకు ముగ్గురు భారతదేశ [[ప్రధాన మంత్రి]] పదవిని చేపట్టినారు. [[మోతీలాల్ నెహ్రూ]] ఈ కుటుంబం నుండి పేరు ప్రఖ్యాతలు పొందిన తొలి వ్యక్తి కాగా, వరుణ్ గాంధీతో పాటు [[రాహుల్ గాంధీ]], ప్రియాంకలు ఐదవ తరానికి చెందినవారు. ప్రారంభం నుండి ఈ కుటుంబం వ్యక్తులు [[కాంగ్రెస్ పార్టీ]] తరఫున ఉండటమే కాకుండా పార్టీ అధ్యక్షపదవిని చేపట్టడంలో మరియు అధికార పదవులు చేపట్టడంలో ముందంజలో ఉన్నారు. కాని వరుణ్ గాంధీ రాజకీయాలలో చేరినప్పటి నుండి [[భాజపా]] పక్షంలోనే ఉన్నాడు. [[2009]] సార్వత్రిక ఎన్నికలలో పోటీచేయడానికి [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రంలోని ఫిలిబత్ఫిలిభిత్ లోకసభ నియోజకవర్గం నుండి పార్టి టికెట్టు కూడా పొందినాడు. ఎన్నికల ప్రసంగంలో మతపరమైన ఉద్రేక ప్రసంగాలు చేసినందుకు ఎన్నికల కమీషన్ పోటీచేయడానికి అనర్హత విధించింది. ఈ విషయంలో వాతావరణం వేడెక్కగా తొలుత బెయిల్ వారెంటు తీసుకున్న వరుణ్ దాని గడుపు ముగయడంతో స్వచ్ఛందంగా [[మార్చి 28]], 2009న పిలిభిత్ స్థానిక కోర్టులో లొంగిపోయాడు.
==ప్రారంభ జీవనం==
[[సంజయ్ గాంధీ]], [[మేనకా గాంధీ]]ల ఏకైక సంతానమైన వరుణ్ గాంధీ 1980, మార్చి 13న జన్మించాడు.<ref>[http://sify.com/news/fullstory.php?id=14350690&page=4 sify.com/news/fullstory.</ref> విధి వక్రించి అతిచిన్న ప్రాయంలో ఉండగానే తండ్రిని కోల్పోయాడు. కేవలం మూడు నెలల వయస్సు ఉన్నప్పుడు తండ్రి సంజయ్ గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇది జరిగిన మరి కొద్ది కాలానికే నానమ్మ అయిన ఇందిరా గాంధీ అంగరక్షకుల తుపాకుల కాల్పులకు బలైంది. ఇతనిది భారతదేశంలోనే చెప్పుకోదగిన కుంటుంబం. [[1989]] నుండి ఐదేళ్ళ పాటు [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[చిత్తూరు]] జిల్లా [[మదనపల్లె]]లో సమీపంలోనున్న రిషీ వాలీ పాఠశాలలో విధ్యాభ్యాసం చేశాడు. ఉన్నత విద్య [[లండన్]] లో జరిగింది.
పంక్తి 32:
 
==ఇటీవలి పరిణామాలు==
మార్చి 5వ తేదీన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ మతపరంగా ఉద్రేక ప్రసంగాలు చేసినట్లు ప్రచారం కావడంతో ఎన్నికల కమీషన్ వరుణ్ గాంధీ ఎన్నికలలో పోటీ చేయరాదని ఆంక్షలు విధించింది. అయితే ఇది రాజకీయంగా తనను ఇరకాటంలో పెట్టేందుకు కుట్రమాత్రమేనని, తాను ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేనని, దీనికి సంబంధించి ఎటువంటి క్షమాపణలు చెప్పే ప్రశక్తే లేదని స్పష్టం చేశాడు. పిలిభిత్‌లో హిందువులు భయంతో బతుకున్నారు. ఓ బ్లాకులో మూడు ఆలయాలను ధ్వంసం చేశారు. అందువలనే ఈ వర్గ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలనుకున్నట్లు చెప్పినాడు.<ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/18/1090318029_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 18-03-2009]</ref> ఈ విషయంలో పరిస్థితి విషమించడంతో ముందస్తు బెయిల్‌కై ప్రయత్నించగా ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరి చేసింది. <ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/20/1090320021_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 20-03-2009]</ref> వరుణ్ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా ముందు వెనుకంజ వేసి తర్వాత వరుణ్ తప్పు లేనట్లు ప్రకటించింది. ప్రారంభంలో భాజపా నాయకత్వం వరుణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.<ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/17/1090317007_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 17-03-2009]</ref> ఈ విషయంలో [[శివసేన పార్టీ]] అధినేత [[బాల్ థాకరే]] ఒక అడుగు ముందు వేసి వరుణ్ గాంధీ మాటలలో తప్పేమీ లేదని ప్రకటించాడు. <ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/18/1090318031_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 18-03-2009]</ref> [[విశ్వ హిందూ పరిషత్తు]] కూడా వరుణ్ గాంధీని సమర్థించింది.<ref>[http://www.hindu.com/2009/03/27/stories/2009032751730300.htm హిందూ ఆన్‌లైన్ ఎడిషన్ తేది 27-03-2009]</ref> తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.ను తొలిగించాలని వరుణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాదు హైకోర్టు తోసిపుచ్చింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> <ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/25/1090325023_1.htm యాహూ తెలుగు వార్తలు తేది. 25-03-2009]</ref> ముందస్తు బెయిల్ గడుపు ముగయడంతో మార్చి 28, 2009న పిలిభిత్ స్థానిక కోర్టులో స్వచ్ఛందంగా లొంగిపోయాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/వరుణ్_గాంధీ" నుండి వెలికితీశారు