"రెడ్‌క్రాస్" కూర్పుల మధ్య తేడాలు

చి
వ్యాస విలీనం రెడ్ క్రాస్స్ సంస్థ
(కొద్ది విస్తరణ)
చి (వ్యాస విలీనం రెడ్ క్రాస్స్ సంస్థ)
 
'''అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం''' (ఆంగ్లం : The '''International Red Cross and Red Crescent Movement''') ఒక అంతర్జాతీయ [[మానవతావాదం|మానవతావాద]] ఉద్యమం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు (కార్యకర్తలు) వున్నారు. వీరు మానవతావాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తూ వుంటారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ మరియు వయో భేదాలు లేకుండా సత్సంకల్పంతో పనిచేస్తూ వుంటారు.
[[File:IKRK Hauptquartier.jpg|thumb|right|ఐ.సి.ఆర్.సి.హెడ్ క్వార్టర్స్ జెనీవా]]
తొలి రోజుల్లో యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవ చేయడానికి మాత్రమే ఇది పరిమితమై ఉండేది. ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలొను రెడ్ క్రాస్ శాఖలు ,యుద్ధ సమయాలలోను ,శాంతి కాలంలోను నిర్విరామంగా పనిచేస్తునే ఉంటాయి. జాతి,కుల,మత విచక్షణా భేదం లేకుండా నిస్సహాయులకు ఇది సేవ చేస్తుంది. శాంతికాలంలో దీని కార్యకలాపాలేవంటే - [[ప్రథమ చికిత్స]] ,ప్రమాదాలు జరగకుండా చూడడం ,త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ నివ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపటానికి మంత్రసానులకు శిక్షణ, వైద్య శాలలను స్థాపించడం, [[రక్త నిధులు]] (Blood Banks) సేకరించడం, మొదలైన పనులు చేస్తుంటుంది.
రెడ్ క్రాస్ ను స్థాపించినది జీన్ హెన్రీ డ్యూనంట్ ( Jean Henry Dunant) . ఆయన జూన్ 24, 1859న వ్యాపారం నిమిత్తమై లావర్డి (Lavardi)నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో[[ ఫ్రాన్స్]] [[ఆస్ట్రియా]]ల మధ్యన జరుగుతున్న యుద్ధం వల్ల గాయపడిన వేలాది స్త్రీ పురుషులు ప్రథమ చికిత్స లేక మరణించడం అతను చూశాడు. హృదయ విదారకమైన ఈ దృశ్యం అతని మనస్సులో చెరగని ముద్ర వేసింది.తన స్వంత పని మరచిపోయి ఆపదలోనున్న వారందరికీ సహాయం చేశాడు.
 
యుద్ధం ముగిసాక అతను ప్రజలందరికీ ఇలా విజ్ఞప్తి చేశాడు. "యుద్ధాలలో గాయపడిన వారందరికి, తక్కిన వారందరూ సహాయం చేయాలి.
ఇది మానవ ధర్మం." ఈ విజ్ఞప్తి ప్రజలందరినీ ఆకట్టుకుంది. 1864లో [[జెనీవా]]లో అంతర్జాతీయ సమావేశం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థాపనకు 14 దేశాలు తమ అంగీకారాన్ని తెలిపాయి.
 
ఇదో ప్రైవేటు సంస్థ. దీనిలో ముఖ్యంగా క్రింది అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి:
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/399799" నుండి వెలికితీశారు