బాబూ రాజేంద్ర ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
== బాల్యము మరియు విద్యాభ్యాసము ==
రాజేంద్ర ప్రసాద్ [[బీహార్]] రాష్ట్రంలో శివాన్ జిల్లాలోని జిర్దేయి గ్రామంలో [[1884]] డిసెంబరు మూడున జన్మించాడు. అతని తండ్రి మహదేవ్ సహాయ్ సంస్కృతం మరియు పర్శియను భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరీ దేవి ఎప్పుడూ రామాయణం నుండి కథలు వివరించేది. ఐదవ ఏటనే [[పర్షియన్]] భాషను నేర్చుకోవడానికి ఒక మౌల్వీ దగ్గరకు పంపించబడ్డాడు. ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసాడు. 12 సంవత్సరాల వయసులోనే రాజ్‌వంశీ దేవీని వివాహం చేసుకున్నాడు. అటు తరువాత విద్యకై పాట్నాలో తన అన్న మహేంద్ర ప్రసాద్ వద్ద ఉంటూ ఆర్.కె.ఘోష్ పాఠశాలలో చదువుకున్నాడు. మరల ఇంకోసారి ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేరి కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.
 
అప్పుడు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. మొదట్లో సైన్సు విద్యార్ధి. అతని అధ్యాపకులలో జగదీష్ చంద్రబోసు, ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదలగువారు ఉన్నారు. కాకపోతే తరువాత సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకుని అటువైపు తన దృష్టి మరల్చాడు.ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. చదివాక,బి.ఎల్. ఆ తర్వాత ఎం.ఎల్. పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందాడు.రాజేంద్ర ప్రసాద్ చదువుతున్నప్పుడు తన అన్నతో కలిసి ఇడెన్ హిందూ హాస్టలులో నివసించేవాడు, అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్నీ నడిపాడు.