పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి మరికొంత సమాచారం
పంక్తి 29:
 
==సినీ విశేషాలు==
* ఈ సినిమా వచ్చే నాటికి అక్కినేని వరుస అపజయాలపర్వంలో ఉన్నాడు.[[ఆస్థిపరులుఆస్తిపరులు]], [[సిడిగుండాలుసుడిగుండాలు]], [[వసంతసేన]], [[ప్రాణ మిత్రులు]] లాంటి సినిమాలు వరుసగా అపజయం పాలయ్యాయి. ఇది అతని ఐదో ప్లాపు సినిమాగా ప్రచారం సాగింది.
 
* సినిమా మొదలయ్యే దిశలోనే ఈ సినిమా కధా రచయితలు మారిపోయారు. మొదట [[గొల్లపూడి మారుతీరావు]]తో కధారచన సాగించారు. అది మధ్యలో ఉండగా గొల్లపూడి [[హైదరాబాద్]] [[ఆలిండియా రెడియో]] కు బదిలీ అయ్యారు. అసంపూర్తిగా ఉన్న కధను రచయిత [[ముళ్ళపూడి వెంకటరమణ]] తో పూర్తి చేయిద్దామనుకొన్నారు, అయితే ఆయన కూడా అప్పుడే [[మద్రాస్]] వదిలి [[విజయవాడ]] చేరుకోవడంతో ఆయనతొ కుదరలేదు. ఇక అప్పటికి [[బలిపీఠం]] నవలతో ప్రఖ్యాతి చెందిన [[ముప్పాళ్ళ రంగనాయకమ్మ]] కు ఆ భాద్యతలు అప్పగించారు.
 
* ముప్పాళ్ళ రంగనాయకమ్మ రచనను తదనంతరం కొంతవరకూ సినిమాకు అనుగుణంగా దర్శకుడు [[ఆదుర్తి సుబ్బారావు]], నిర్మాత [[దుక్కిపాటి మదుసూదనరావు]] లు దిద్దుకొని వాటికి సంపూర్ణతను చేకూర్చారు.
 
* ఈ చిత్రంలో అక్కినేనికి [[చెల్లెలు|చెల్లెలుగా]] [[విజయనిర్మల]], [[బావ|బావగా]] [[సోభన్శోభన్ బాబు]] లు కీలక పాత్రలు పోషించారు.
 
* ఈ చిత్ర కధానాయక [[జమున]] అంతకు ముందు వచ్చిన దొంగరాముడు సినిమాలో అక్కినేనికి చెల్లెలుగా నటించింది. ఈ సినిమాకు ఆమెను అతనికి కధానాయకిగా ఎన్నిక చేసారు.
 
* [[గుమ్మడి]], [[చిత్తూరు నాగయ్య]], [[అల్లు రామలింగయ్య]] లాంటి కొంతమందిని తప్ప సినిమాలో కావలసిన అన్ని పాత్రలకు స్థానిక నాటక కళాకారులను తీసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. ఇది అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరచిన సంఘటన కూడా.
 
* ఈ చిత్రంలో అక్కినేని, నాగయ్యలు తండ్రీ కొడుకులు. సన్ని వేశపరంగా వీళ్ళిద్దరూ జైలులో కలుస్తారు. ఖైదీలతో కలసి 'చిల్లర రాళ్ళకు మొక్కితే చెడిపోవుదువురా' అనే గీతం ఉంటుంది. ఈ సన్నివేశానికి సెట్టింగ్ వేస్తే బావుండదని భావించిన దర్శక నిర్మాతలు అప్పటికి జైళ్ళ శాఖను చూస్తున్న మంత్రి [[పి.వి.నరసింహారావు]] ను సంప్రదిస్తే ఆయన [[చంచల్ గూడ]], [[ముషీరాబాద్]] జైళ్ళను షూటింగ్ కోసం అనుమతిచ్చారు.
 
* ఈ చిత్రంలో 'నీ జిలుగు పైట నీడలోన నిలువనీ' అనే ఒక పాటను కలరులో తీయటం విశేషం. ఆ రకంగా రంగుల చిత్రానికి అన్నపూర్ణ వారు తెర తీసారు. అలాగే ఈ చిత్రంలో ప్రజాదరణ పొందిన పాటలతో పాటు ఒక [[బుర్రకధ]] కూడా ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/పూల_రంగడు_(1967_సినిమా)" నుండి వెలికితీశారు