"మాలిక్ మక్బూల్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
1323వ సంవత్సరములొ ముస్లిముల ధాటికి [[ఓరుగల్లు]] తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు మరియు పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కారు. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు [[నర్మదా]] నదిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ చేరిన పిదప గన్నమ నాయునికి మరణము లేక మతాంతరీకరణ ఎన్నుకొనవలసి వచ్చింది. ఆ కాలములో మరణమనగా బ్రతికుండగనే చర్మము ఒలచబడుట. మరియు తలను కోట గుమ్మమునకు వ్రేలాడదీయుట [[ఢిల్లీ]] సుల్తానుల రివాజు. గన్నమ మాలిక్ మక్బూల్ గా మార్చబడ్డాడు. సుల్తాను మక్బూల్ ను [[పంజాబ్]] పాలకునిగా ముల్తాను పంపాడు.
 
 
ఉలుఘ్ ఖాను ([[మహమ్మదు బిన్ తుగ్లకు]]) ఓరుగల్లును 1323లో [[దౌలతాబాదు]] అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచాడు. అటుపిమ్మట ముసునూరి నాయకుల విప్లవముతో తెలుగునాడు విముక్తమైంది. 1335లో [[మధుర]] సుల్తాను జలాలుద్దీను కూడ తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. ఇది సహించని తుగ్లకు పెద్దసైన్యముతో మక్బూల్ ను తొడ్కొని ఓరుగల్లు చేరాడు. అచట ప్రబలుతున్న మహమ్మారి వల్ల సుల్తానుకు అంటుజాడ్యము సోకింది. భయపడిన సుల్తాను తూర్పు తెలంగాణమును[[తెలంగాణ]]మును మక్బూల్ ను అధిపతిగా చేసి ఢిల్లీ తిరిగి వెళ్ళాడు. 1336లో కాపానీడు మక్బూల్ ను ఓరుగంటినుండి తరిమివేసి కోటను జయించాడు.
 
 
అటు పిమ్మట మక్బూల్ తిరిగి ఢిల్లీ దర్బారు చేరి [[గుజరాత్]] మరియు సింధు దేశములలొ పెక్కు విజయములు సాధించాడు. అప్పటినుండి మక్బూల్ ఢిల్లీ దర్బారు లో వజీరు (ప్రధాన మంత్రి) గా నియమించబడ్డాడు. భాషాప్రాంతమతభేధములనధిగమించిభాషాప్రాంతమతభేధములను అధిగమించి ఢిల్లీ దర్బారునందుదర్బారులో క్లిష్టపరిస్థితులలో మక్బూల్ సాధించినది అతని ప్రతిభాపాటవములకు తార్కాణము.
 
 
 
 
మక్బూల్ 1372లో చనిపోయాడు. ఈతని సమాధి భారతదేశములోని మొదటి అష్ఠకోణపు కట్టడము. ఇది ఢిల్లీలో [[హజ్రత్ నిజాముద్దీను]] దర్గా సమీపములో ఉన్నది. ఆక్రమణలవల్ల, నిర్లక్ష్యమువల్లను సమాధి శిధిలావస్థలో ఉన్నది.
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/402020" నుండి వెలికితీశారు