వరుణ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

+ బొమ్మ
పంక్తి 25:
[[సంజయ్ గాంధీ]], [[మేనకా గాంధీ]]ల ఏకైక సంతానమైన వరుణ్ గాంధీ 1980, మార్చి 13న జన్మించాడు.<ref>[http://sify.com/news/fullstory.php?id=14350690&page=4 sify.com/news/fullstory.</ref> విధి వక్రించి అతిచిన్న ప్రాయంలో ఉండగానే తండ్రిని కోల్పోయాడు. కేవలం మూడు నెలల వయస్సు ఉన్నప్పుడు తండ్రి సంజయ్ గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇది జరిగిన మరి కొద్ది కాలానికే నానమ్మ అయిన ఇందిరా గాంధీ అంగరక్షకుల తుపాకుల కాల్పులకు బలైంది. ఇతనిది భారతదేశంలోనే చెప్పుకోదగిన కుంటుంబం. [[1989]] నుండి ఐదేళ్ళ పాటు [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[చిత్తూరు]] జిల్లా [[మదనపల్లె]]లో సమీపంలోనున్న రిషీ వాలీ పాఠశాలలో విధ్యాభ్యాసం చేశాడు. ఉన్నత విద్య [[లండన్]] లో జరిగింది.
==రాజకీయ జీవనం==
[[File:Varun Gandhi in a public meeting in Pilibhit.jpg|right|200px|thumb|<center>ఫిలిబిత్ పబ్లి మీటింగ్‌లో వరుణ్ గాంధీ</center>]]
===కుటుంబ రాజకీయాలు===
భారతదేశంలోనే అతి ముఖ్యమైన రాజకీయ కుటుంబంలో జన్మించుటచే వరుణ్‌కు రాజకీయాలు వారసత్వంగా వచ్చినవే. తన నానమ్మ తాత అయిన [[ మోతీలాల్ నెహ్రూ‎]] భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాడు. నానమ్మ తండ్రి [[జవహర్‌లాల్ నెహ్రూ‎]] జాతీయోద్యమ నేతనే కాకుండా భారత జాతీయ కాంగ్రెస్‌లో చురుగ్గా పాలుపంచుకొని పార్టీ అద్యక్ష పదవిని కూడా చేపట్టినాడు. స్వాతంత్ర్యానంతరం భారత తొలి ప్రధానమంత్రిగా సుధీర్ఘకాలం పనిచేశాడు. నానమ్మ ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి పదవిని నిర్వహించింది. ఇందిరా గాంధీ పాలనా సమయంలోనే వరుణ్ తండ్రి సంజయ్ గాంధీ కూడా రాజకీయాలలో చురుగ్గా వ్యవహరించాడు. 1980లో తండ్రి సంజయ్ గాంధీ మరణంతో సంజయ్ సోదరుడు [[రాజీవ్ గాంధీ‎]] రాజకీయాలలో ప్రవేశించి ఆ తరువాత ప్రధానమంత్రి పదవి కూడా చేపట్టినాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలైన [[సోనియా గాంధీ‎]] రాజీవ్ భార్య. వరుణ్ తల్లి మేనకా గాంధీ కూడా సంజయ్ గాంధీ మరణం అనంతరం రాజకీయాలలో ప్రవేశించింది. ప్రారంభంలో సంజయ్ విచార్ మంచ్ పార్టీని స్థాపించింది. ఈ పార్టీ [[1984]] ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో [[తెలుగుదేశం]] పార్టీతో పొత్తు పెట్టుకొని ఐదు స్థానాలకు పోటీచేసి నాలుగు చోట్ల విజయం సాధించింది. ప్రస్తుతం మేనకా గాంధీ భారతీయ జనతా పార్టీ తరఫున లోకసభ సభ్యురాలిగా ఉంది.
"https://te.wikipedia.org/wiki/వరుణ్_గాంధీ" నుండి వెలికితీశారు