జయంతి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటి '''జయంతి''' అసలు పేరు '''కమల కుమారి'''. [[శ్రీకాళహస్తి]] లో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి [[కన్నడం]]లో రాజ్‌కుమార్‌కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు.

మద్రాసులో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి [[చంద్రకళ]] వద్ద నాట్యం నేర్చుకోసాగింది. ఒకనాడు కన్నడ సినిమా షూటింగ్ చూడడానికి స్కూలు విద్యార్ధినులతో వెళ్ళింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు [[వై.ఆర్.స్వామి]] కమలకుమారి రూపురేఖల్ని చుసి ''జేనుగూడు'' అనే సినిమాలోని ముగ్గురు నాయికల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదని ఆమె పేరును జయంతిగా మార్చారు.

[[ఎన్.టి.రామారావు]] తో నటించిన [[జగదేకవీరుని కథ]] ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. [[బాలనాగమ్మ]], [[స్వర్ణమంజరి]], [[కొండవీటి సింహం]] లాంటి హిట్‌ సినిమాల్లో నటించారు. దర్శకులు [[కె.వి. రెడ్డి]], [[కె.విశ్వనాథ్‌]], [[కె.బాలచందర్]] లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. 1960లోనే 'మిస్‌ లీలావతి' అనే సినిమాలో స్విమ్మింగ్‌ పూల్‌ డ్రస్‌లో నటించారు. అనూహ్యంగా ఈ సినిమాలోనే ఆమెకు ప్రభుత్వం నుంచి అవార్డు అందింది. [[కన్నడ]], [[తెలుగు]], [[మళయాళం]] భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/జయంతి_(నటి)" నుండి వెలికితీశారు