హరనాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''హరనాథ్''' ([[1936]] - [[1989]]) ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతని కుమారుడు సినిమా నిర్మాత [[జి.వి.జి.రాజు]].
హరనాథ్ 1936, సెప్టెంబర్ 2న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[రాపర్తి]]లో జన్మించాడు. ఈయన అనేక స్వల్ప వ్యయంతో నిర్మించే సినిమాలలో కథానాయకుడుగా పనిచేశాడు. కళాశాలలో చదువుకునే రోజుల్లో హరనాథ్ అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. ఒక రోజు మద్రాసులోని పాండీ బజార్లో చెప్పులు కొనుక్కుంటుండగా దర్శకుడు గుత్తా రామినీడు హరనాథ్ ను చూసి తను తీయబోతున్న కొత్త చిత్రం మా ఇంటి మహాలక్ష్మిలో కథానాయకుడి పాత్రకోసం ఎన్నుకున్నాడు. హైదరాబాదులో నిర్మించిన తొలి తెలుగు సినిమా, [[మా ఇంటి మహాలక్ష్మి]] (1959) తో హరనాథ్ కథానాయకుడుగా తెలుగు సినిమా రంగంలో ప్రవేశించాడు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులే హరనాథే ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు.<ref>http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm</ref> [[నందమూరి తారక రామారావు]], తన సొంత సంస్థ ఎన్.ఎ.టి పతాకంపై దర్శకత్వం వహించి నిర్మించిన తొలి చిత్రం [[సీతారామకళ్యాణం]]లో కథానాయకునిగా హరనాథ్ ను ఎంచుకున్నాడు. ఆ సినిమాలో ఎన్టీయార్ రావణుని పాత్ర పోషిస్తే హరనాథ్ రాముని వేషం వేశాడు. ఈయన 1989 నవంబర్ 1 మరణించాడు.
 
చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిధి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా, చిరంజీవి నటించిన [[నాగు]] సినిమాలో తండ్రి పాత్ర పోషించాడు. ఈయన 1989 నవంబర్ 1 మరణించాడు.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/హరనాథ్" నుండి వెలికితీశారు