పోషకాహార లోపం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్ధాలు లోపించిన [[ఆహారం]] తీసుకోవడాన్ని '''పోషకాహార లోపం''' (Malnutrition) అంటారు. దీనికి [[ఉపవాసాలు]] చేయడం, అనారోగ్య పరిస్థితులు, [[పేదరికం]], [[మూఢ నమ్మకాలు]], అవగాహనా రాహిత్యం, సాంఘిక, ఆర్థిక కారణాలు, అపరిశుభ్రత ముఖ్యమైన కారణాలు. దీర్ఘకాలంగా పోషకాహారం లోపిస్తే పెరుగుతున్న పిల్లల్లో ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. వీరిలో జీవక్రియా రేటు అధికంగా ఉండి తగినంత కార్బోహైడ్రేట్లు, కొవ్వులు నిల్వ ఉండవు. కాబట్టి కొద్దికాలంలోనే ఈ నిల్వలు కరిగిపోయి పిల్లలు తమ శరీర ద్రవ్య పదార్ధాన్ని కోల్పోతారు. దీనివలన [[వ్యాధి నిరోధక శక్తి]] తగ్గి అనారోగ్యానికి గురవుతారు.
 
==రకాలు==
*'''కాలరీ పోషకాహార లోపం''' (Calorie Malnutrition): ఇది శక్తి జనకాలైన కార్బోహైట్రేట్లు, కొవ్వులు తగిన మోతాదులో తీసుకోని పిల్లల్లో కనిపిస్తుంది. దీనిని శక్తి పోషకాహార లోపం అని కూడా అంటారు.
*'''ప్రోటీన్ పోషకాహార లోపం''' (Protein Malnutrition): ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకునే పిల్లల్లో ఈ లోపం కనిపిస్తుంది.
*'''ప్రోటీన్ కాలరీ పోషకాహార లోపం''' (Protein Calorie Malnutrition): ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నవారిలో ఇది కనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/పోషకాహార_లోపం" నుండి వెలికితీశారు