వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 12: కూర్పుల మధ్య తేడాలు

వివరణలకు విన్నపం
పంక్తి 19:
 
ఈ విషయాలకు మీరు గాని, కాసుబాబుగారుగాని (వారి చర్చా పుటలో కూడ ఈ వ్యాఖ్యని కాపీ చేస్తున్నాను) నాకు వివరించగలరు. ఈ వ్యాఖ్యలు నేను వ్రాయటానికి పురికొల్పిన సంఘటనకు కారణమైన వారు దయచేసి కలుగ చేసుకొనవద్దు--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 03:05, 26 ఏప్రిల్ 2009 (UTC)
:వికీలో చాలా నియమాలు అభివృద్ధి క్రమబద్దీకరించడానికి అభివృద్ధి చెందుతున్న కొద్ది ఏర్పరచుకొన్నవే. మీకో చిన్న ఉదాహరణ ఇస్తాను ఒక ఊళ్లో ఒక కాలిబాట ఉందనుకోండి అందులో ఎవరిష్టం వచ్చినట్టు వస్తూ వెళుతూ ఉంటారు. అప్పుడు ట్రాఫిక్ సిగ్నల్లు, రైట్ అఫ్ వేలు, ఏడమవైపునే నడవటాలు ఇవన్నీ ఉండవు. కానీ ఆ కాలిబాటలో రద్దీ ఎక్కువై అది అభివృద్ధి చెందే కొద్ది కాస్త ఆ విషయం ఆలోచన చేసిన వ్యక్తి వచ్చి బాటలో నడిచేవాళ్లందరూ ఎడమవైపున నడుస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అంటాడు. చాలామంది ఏదో ఒక పద్ధతి బాగానే ఉంది అనుకుని ఆయన చెప్పింది పాటించడం మెదలెడతారు. అదే కాలక్రమంలో మరింత ధృడమై ఒక నియమం అవుతుంది. అలా ఏర్పడే తొలి దశలోనే కొందరు ఎడమ వైపు ఎందుకు నడవాలి కుడివైపున నడిస్తే ఏం పోయింది అని ప్రశించవచ్చు. నష్టమేం లేదు అలాగే నిక్షేపంగా నడవవచ్చు. అలా నియమాలు ఏర్పడే ముందస్తుగా కొంత ఇబ్బంది ఎదురౌతుంది దానికి అనుగుణంగానే కాస్త ఇలా చేస్తే బాగుంటుందేమో ఎవరో ఒకరు ముందుకొచ్చి ప్రతిపాదిస్తారు.
:ఇక అసలు విషయానికొస్తే బొమ్మ చేర్చిన ఎన్ని ఘడియలు, విఘడియలకు అది ఈ వారం బొమ్మగా పెట్టగలమో ఇప్పటివరకు తెలుగు వికీలో నియమమేమి లేదు. ఇక్కడ చిన్న ఇబ్బంది ఎదురైంది కాబట్టి ఇప్పుడే మనం కలిసి ఒక నియమం సృష్టిద్దాం. ఒక బొమ్మను ఈ వారం బొమ్మగా పెట్టే ముందు దాన్ని ఈ వారం బొమ్మ పరిగణన అన్న మూస తగిలించి దిన్నీ మొదటి పేజీలో పెట్టాలనుకుంటున్నాం అని తెలియజేయటం కొన్నాళ్ళుగా నడిస్తున్న సంప్రదాయామే. అది కొత్తేమీ కాదు. అలా చేయటం వలన అది ప్రదర్శించడానికి ఇతర సభ్యులకేమైనా అభ్యంతరాలు కానీ ఇతర చర్చలు కానీ చేయటానికి కొంత సమయం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఈ వారం బొమ్మ పరిగణన మూస అంటించిన తర్వాత కనీసం ఒక నెల రోజులైనా ఆగి దాన్ని మొదటి పేజీలో ప్రదర్శిస్తే బాగుంటుంది. మీరు ప్రదర్శించాలనుకున్న బొమ్మకు ఎవరూ అభ్యంతరపెడతారని కాదు, ఒక పద్ధతి కోసమని అంతే. మీకు ఇతర సూచనలు, ఇతర పద్ధతులు కానీ తొచితే అలాగే చేద్దాం.
: ఎవరైనా ఒక పద్ధతిని ప్రతిపాదిస్తే కాలిబాట విషయంలో జరిగినట్టు మొదట ఆ పద్ధతినే ఎందుకు పాటించాలి అని కొంతమందికి అనిపించవచ్చు. అది సహజం. ఎడమవైపే వెళ్ళాలని ప్రతిపాదించిన వ్యక్తిని అలానే ఎందుకు చేయాలో అడిగి తెలుసుకోవచ్చు. అది నచ్చకపోతే ప్రత్యామ్నాయ పద్ధతిని మీరూ ప్రతిపాదించవచ్చు. నియయాలు చేయటానికి నిర్వాహకులకు ప్రత్యేక అధికారమేమీ లేదు. చాలా మందికి సభ్యులకు ఏది సబబుగా అనిపిస్తే అదే నియమమౌతుంది. ఉదాహరణకు నాతో పాటు కొందరు నిర్వాహకులు, సభ్యులకు తెవికీ వ్యాసాల్లో ఏకవచనమే ఉపయోగిస్తే బాగుంటుందని అనిపించింది. దాన్ని రచ్చబండలో చర్చించాం. ఆ నియమానికి మద్దతుగా కొన్ని విషయాలను సేకరించి నేను ఒక నియమపు పేజీ వ్రాశాను. రాజశేఖర్ గారితో పాటు కొందరు సభ్యులకు ఆ నియమాన్ని పాటించడం సబబుగా అనిపించలేదు. అందుకే ఆయన వ్రాసేవి ఆయన బహువచనంలోనూ, నేను వ్రాసేవి ఏకవచనంలోనూ ఉంటాయి. చివరకు ఏ పద్ధతి ఎక్కువమంది సభ్యులు పాటిస్తే అదే నెగ్గుతుంది. ఇలాంటి పద్ధతుల్లో తేడా ఉన్నా అందరం కలిసి పనిచేయటానికి ఏనాడూ అడ్డురాలేదు. అయితే మీరు ప్రత్యామ్నాయ పద్ధతిని ప్రతిపాదిస్తే దాన్ని గల కారణాలు వివరిస్తే చాలా మంది సభ్యులు ఆ పద్ధతి ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
: క్రిందనే వ్రాయాలని నియమేమీ లేదు. అదో ఆనవాయితీ మాత్రమే. కొత్త సందేశం వచ్చిందనగానే వెతుక్కోకుండా క్రిందనే ఉంటుందనే ఒక సౌకర్యం. ఆంగ్ల వికీలో నియమంగా ఉందో లేదో కానీ మర్యాదపూర్వకంగా పాటిస్తుంటారు. మీరు పైనే ఎందుకు వ్రాయాలో అని వివరించండి అది బాగుందనుకుంటే అలాగే వ్రాద్దాం ( కాలిబాట ఉదాహారణ లాగా కుడో, ఎడమో ఏదో ఒకటి పద్ధతుంటే బాగుంటుంది). చంద్రకాంతరావు ఇప్పటివరకు ఉపయోగంలో ఉన్న పద్ధతి చెప్పారంతే. నిజానికి వికీలో ఖచ్చితంగా అమలుపరచే నియమాలు ఐదే ఉన్నాయి. మిగిలినవి మార్గదర్శకాలు మాత్రమే.
: ఒక వ్యాసం గురించి చర్చను సాధారణంగా ఆ వ్యాసం చర్చా పేజీలోనూ, వెంటనే దానికి సంబంధించిన సభ్యులు కూడా చూడాలనుకుంటే ఆ సభ్యుల చర్చా పేజీల్లోనూ వ్రాస్తారు. ఇది కూడా ఒక పద్ధతి మాత్రమే.
: చర్చా పేజీలలో విషయం ఆ సభ్యుని చెందుతుందా, వికీకి చెందుతుందా అన్ని విషయం ఆంగ్ల వికీలో సుదీర్ఘమైన తాత్విక చింతన జరిగింది. దాని పర్యవసానంగా సభ్యుల చర్చాపేజీలను వారు తొలగించమని అడిగినా పూర్తిగా తొలగించకూడదని నిర్ణయం తీసుకున్నారు. తెవికీలో దీని గురించి చర్చించలేదు కానీ, చర్చా పేజీలను తొలగించడం అంతమంచి పద్ధతి కాదు. దానికి అనేక హేతువులున్నాయి. అవి తర్వాత వ్రాస్తాను. మీరు పైన వ్రాసిన పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అవలంబిగలరనుకుంటే ఇది మొదటిది కావాలని నా కోరిక.
: నువ్వు, మీరు అన్నదాని గురించి నేను చర్చించలేను. అది మీ దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. రాయలసీమలోనూ, తెలంగాణలోనూ నువ్వు అనటం పెద్ద అగౌరవసూచకంగా భావించరు అని మాత్రం చెప్పగలను. వికీ చాలా ప్రత్యక్ష మాధ్యమం కాబట్టి అవతలి వ్యక్తికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి వదిలెయ్యండి. ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగానో, ఫోన్లోనో అయితే రెండు నిమిషాల్లో అనుకున్నదనుకున్నట్టు వివరంచగలిగి ఉండేవాడిని అయితే ఒక పేజీ మొత్తం టకటకలాడించినా మీకు సరైన అర్ధంలో స్ఫురిస్తుందో లేదో తెలియదు. చంద్రకాంతరావు గారు ఇప్పటిదాకా ఉన్న పద్ధతులను వివరించే ప్రయత్నం చేశారనుకుంటాను. అది ఆ స్పిరిట్ తోనే తీసుకొని వదిలెయ్యండి.
: చివరిమాటగా వికీలో పట్టూ విడుపూ రెండూ ఉంటాయి. అందరూ ఎవరి పద్ధతిని వారు వెళితే ఇది హైదరాబాదు రోడ్డవుతుంది. కానీ మార్గదర్శకాలు చేయటానికి, వాటిని ప్రభావితం చేయటానికి ప్రతి సభ్యునికి అధికారం ఉంది. నిర్వహకులకు ప్రత్యేక అధికారమేమీ లేదు. వికీ పద్ధతులలో అనుభవమున్న వాళ్ళు కొత్తవాళ్లకు మార్గదర్శకం చేస్తూ ఉండటం సాధారణమే దానికి నిర్వాహకుడే కానక్కర్లేదు.
[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 04:25, 26 ఏప్రిల్ 2009 (UTC)
 
==కార్టూనిస్ట్‌ల మీద వ్యాసాలు==
 
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 12".