పసుపులేటి కన్నాంబ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
* ‘నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకధాటిగా.....’ అని ఒక పాట. చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవిగా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన ఆ మహానటి పనుపులేటి కన్నాంబ. ఆ సినిమా పేరు ‘చండిక’ (41), ఠీవి గురించి ఆ రోజుల్లో ఆ సినిమా చూసినవాళ్లు చెప్పుకునేవారు. అందులో కన్నాంబ ఇంకా కొన్ని పాటలు పాడారు. మరొక పాట : ఏమే ఓ కోకిలా - ఏమో పాడెదవు, ఎవరే నేర్పినది ఈ ఆట ఈ పాట.....‘ ఈ పాటలో ఆమె నవ్వులు రువ్వుతూ పాడతారు. మధ్యమధ్యలో వచ్చే ఆ నవ్వు - ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి జనం చెప్పుకునేవారు.
 
* [[కడారు నాగభూషణం]] గారిని వివాహం చేసుకుని శ్రీ [[రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ]] స్థాపించి తెలుగు తమిళభాషల్లో 22 చిత్రాలు నిర్మింపజేశారామె. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ! వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది. ఎక్కువగా క్యారెక్టర్స్‌ ధరించినా, కన్నాంబకు హీరోయిన్‌ గ్లామరే వుండేది. ఇప్పుడు ’టైటానిక్‌ చీరలు‘ అంటూ సినిమా పేర్లతో చీరలు వస్తున్నట్టు - అప్పుడు ’కాంచనమాల గాజులు - కన్నాంబ లోలాకులు‘ అంటూ ఆభరణాలు వచ్చేవి. కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు అనీ, బంగారు కాసులు డబ్బాల్లో పోసి, పప్పులు, ఉప్పులు పెట్టుకునే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారనీ చెప్పుకునేవారు.
 
* ఐశ్యర్యం ఎలా వస్తుందో ఎలా పోతుందో వరూ చెప్పలేరని పెద్దలు చెబుతారు. ఎలా పోయాయో, ఏమైపోయాయో గాని కన్నాంబ మరణంతో కంపెనీతో సహా అన్నీ పోయాయి. ఆమె భర్త నాగభూషణం ఒక చిన్నగదిలో ఉంటూ కాలక్షేపం చేసేవారు. ఒకసారి ఒక మిత్రుడు ఆయన్ని కలవాలని ఆ గదికి వెళ్లి ‘గుండె కలుక్కుమంది. ఆ వాతావరణం చూడలేక తిరిగి వచ్చేశాను’ అని చెప్పారు. ‘ఆ చిన్నగదిలో ఒక ట్రంకు పెట్టె, ఓ కుర్చీ మాత్రం ఉన్నాయి. ఎదురుగా కన్నాంబ ఫోటో, దండెం మీద తువ్వాలు తప్ప ఇంకేం కనిపించలేదు. ఆయన కిందనే చాపమీద కూచుని, దినపత్రిక చదువుకుంటున్నారు’ అన్నారా మిత్రుడు.
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_కన్నాంబ" నుండి వెలికితీశారు