పి.ఆదినారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పి.ఆదినారాయణరావు''' ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత.
 
వీరు [[ఆగష్టు 21]] [[1918]] సంవత్సరంలో [[విజయవాడ]]లో జన్మించారు. చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]]కు చెందిన 'పెదగురువు' అనే [[పట్రాయని సీతారామశాస్త్రి]] తండ్రి గారి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత [[సి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[గొల్లభామ]] చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1950లో [[బి.ఎ.సుబ్బారావు]] నిర్మించిన [[పల్లెటూరి పిల్ల]] చిత్రానికి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి [[అంజలీదేవి]] పేరుతో 1953లో [[అంజలీ పిక్చర్స్]] స్థాపించారు. 1955లో నిర్మించిన [[అనార్కలి]] చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని 'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా' అనే మధుర గీతం వీరి సంగీత బాణీకి ఒక మచ్చుతునక. తరువాత 1957లో రూపొందించిన [[సువర్ణసుందరి]] తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంగీత రసకలశం. [[సతీ సక్కుబాయి]] వీరి కీర్తి కిరీటాన మరో కలికితురాయి.
 
వీరు [[1991]] సంవత్సరంలో [[జనవరి 25]] న పరమపదించారు.
 
 
==సంగీతం కూర్చిన సినిమాలు==
# [[చండీప్రియ]] (1980)
# [[కన్నవారిల్లు]] (1978)
# [[మహాకవి క్షేత్రయ్య]] (1976) - నిర్మాత కూడాను
# [[అల్లూరి సీతారామరాజు]] (1974)
# [[భక్త తుకారాం]] (1973)
# [[పెద్ద కొడుకు]] (1972)
# [[మోసగాళ్ళకు మోసగాడు]] (1971)
# [[అగ్ని పరీక్ష]] (1970)
# [[అమ్మకోసం]] (1970) - నిర్మాత కూడాను
# [[సతీ సక్కుబాయి]] (1965)
# ఫూల్ కీ సేజ్ (1964)
# [[స్వర్ణ మంజరి]] (1962) - నిర్మాత కూడాను
# మంగయిర్ ఉల్లన్ సెల్వమ్ (1962)
# అడుత వీటు పెన్న్(1960)
# [[ఋణానుబంధం]] (1960)
# మనలనే మంగాయిన్ భాగ్యమ్ (1957)
# [[సువర్ణ సుందరి]] (1957) - నిర్మాత మరియు రచయిత కూడాను
# [[అనార్కలి]] (1955)
# [[అన్నదాత]] (1954)
# [[పరదేశి]] (1953) - నిర్మాత కూడాను
# [[పల్లెటూరి పిల్ల]] (1950)
# [[గొల్లభామ]] (1947)
 
 
==బయటి లింకులు==
* [http://www.cscsarchive.org/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/28009193c24f26c565256fa1003a8a66/$FILE/Te220092.pdf స్వరరాజశేఖరుడు ఆదినారాయణరావు]
* [http://www.imdb.com/name/nm0654891/ imdbలో ఆదినారాయణరావు పేజీ]
 
 
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
"https://te.wikipedia.org/wiki/పి.ఆదినారాయణరావు" నుండి వెలికితీశారు