వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 12: కూర్పుల మధ్య తేడాలు

సత్యాగారికి మనవి
పంక్తి 87:
 
'''[[వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)]]'''లో "సినిమా వ్యాసాల పునర్వ్యవస్థీకరణ" గురించి నేను వ్రాసింది ఒకమారు చూడగలవా? ప్రారంభంలో ఈ పేజీలపై చాలా ఎక్కువగా శ్రమించింది నువ్వే గనుక ఈ ప్రతిపాదన గురించి నీ అభిప్రాయం తెలుసుకోగోరుతున్నాను. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 15:27, 14 ఏప్రిల్ 2009 (UTC)
== మనవి ==
చంద్రకాంతరావు గారూ, ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్లూ, ఫిర్యాదులు తెవికీకి కొత్త కాబట్టి నాక్కూడా నియమాలు పద్ధతులు తెలియవవు. కానీ కామన్‌సెన్సుతో ఈ అభ్యర్ధన చేస్తున్నాను. దయచేసి శివగారి ఫిర్యాదులను పరిశీలించే క్రమంలో మీరు కలుగజేసుకోకుండా సంయమనం పాటించాలని అభ్యర్ధన --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 18:42, 29 ఏప్రిల్ 2009 (UTC)
:వైజాసత్య గారూ, మీరు మొదటినుంచి అన్నీ పరిశీలిస్తున్నారనుకుంటాను. చిన్న విషయానికి ఇంతవరకు రావడానికి కారణం ఆ సభ్యుడి రెచ్చగొట్టే వ్యాఖ్యలే తప్ప మరేమీ కాదు. అంతమాత్రాన నేను సంయమనం కూడా కోల్పేలేను. కేవలం ఏకవచనం ప్రయోగించినంతమాత్రాన సంయమనం లేదని ఆ సభ్యుడు ఎలా చెప్పగలుతున్నాడు. ఏకవచన ప్రయోగం తప్పు కానేకాదు. ఏకవచనం ఉపయోగించిననంతమాత్రాన విమర్శించినట్లుకాదు, తిట్టినట్లు అసలే కాదు. నేను ఏకవచనం ప్రయోగించడం ఉద్దేశ్యపూర్వకంగానే అని ఒప్పుకుంటాను. గౌరవం ఇవ్వనంతమాత్రాన ఇది విమర్శకాదుకదా! నా వ్యాఖ్యలకు గౌరవం ఇవ్వని సభ్యుడికి నేను గౌరవం ఎలా ఇవ్వగలను! అలాగని నేనెప్పుడూ ఎదురుదాడికి దిగలేను. ఆ సభ్యుడి ప్రవర్తన మొదటి నుంచే గమనిస్తున్నాను. గౌరవంగా చెప్పినట్లు చెప్పి చివరగా వెక్కిరించడం అతడికి బాగా అలవాటు. మొన్ననే వ్రాసిన వ్యాఖ్యలో చూడండి - "దయచేసి కలుగజేసుకోవద్దు" అనడం బాగానే ఉంది, "నేను ఈ వివరణలు అడగటానికి కారణం, భవిష్యత్తులో నేను గాని, ఇతర నాలాంటి సామాన్య సభ్యులెవరైనా గాని, ధాష్టీకానికి, పిడివాదానికి గురికాకుండా ఉండాలని మాత్రమే" అనడం ఎందుకు? ఇదివరకు ఏ కొత్తసభ్యుడికైనా దాష్టీకం, పిడివాదానికి గురిచేశామా? మరెంతో వెనక్కి పోవడమెందుకు, ఇటీవలి కాలంలో సభ్యత్వం పుచ్చుకొని చురుగ్గా రచనలు చేస్తున్నా నాగరాజు గారి చర్చా పేజీ చూస్తే తెలుస్తుంది కొత్త వారికి ఎలా సహకారం అందిస్తున్నామో. నాగరాజు గారు తెలియని విషయాలు తెలుసుకుంటూ, చేసిన వ్యాఖ్యలకు గౌరవం ఇస్తూ మళ్ళీ అలాంటి పొరపాటు చేయడం లేదు. సభ్యుడంటే అలాగుండాలి. నాకెవరూ చెప్పవద్దు, నా చర్చాపేజీలో వ్రాయవద్దు అనడానికి అర్థమేమిటి? నాకు తెవికీ పాలసీల పట్ల అవగాహన వచ్చినప్పటి నుంచి నాకు తెలిసిన వాటిని కొత్త సభ్యులకు చెప్పి అవగాహన కల్పించడమే నా బాధ్యతగా (నిర్వాహకుడిగా హోదా కంటె ముందు నుంచే) పెట్టుకున్నాను. ఈ బాధ్యత ఎవరో ఇచ్చించి కాదు, మరెవరో తీసుకోకూడనిదీ కాదు. నేను ఆ సభ్యుడి చర్చా పేజీలో వ్రాయడానికి "ధాష్టీకానికి, పిడివాదం" పదాలే కారణం, ఆ పదాలే లేకుంటే నేను ఆ చర్చలో పాలొనే వాడిని కాను. అయిననూ నా గురించి విమర్శనాత్మకంగా వ్రాసి నాకు చర్చలలో పాల్గొనవద్దని అనడమెందుకు? అయిననూ అతడి అనవసరపు ప్రశ్నలకు జవాబు చెప్పలేను. ఒక్కోదానికి టన్నులకొద్దీ జవాబు చెప్పే అవకాశం, అవగాహన నాకు ఉంది. ఇక బొమ్మ విషయానికి వస్తే నేను బొమ్మను తొలిగించలేను. కేవలం ఈవాబో పేజీ నుంచి మాత్రమే తొలిగించాను. బొమ్మను అప్లోడ్ చేసినవెంటనే బొమ్మ చర్చాపేజీలో ఈవాబొ మూస పెడితే సరిపోయేది. ఏకంగా మొదటి పేజీలోనే ప్రదర్శనకు పెట్టడం ఎంతవరకు సమంజసం? అదే విషయము అతడి చర్చా పేజీలో వినయంగానే చెప్పాను. పాలసీలు, గీలసీలు నాకు అక్కరలేదు, నేను పెట్టిన బొమ్మను ఎలా తొలిగించావని పెద్ద కోపం వచ్చి, నేను చెప్పిన తెవికీ వ్యాఖ్యలను "అనవసర వ్యాఖ్య"గా సారాంశంలో వ్రాసి ఏకంగా తొలిగించివేశాడు. మామూలుగా తొలిగించినా నేను బాధపడేవాడిని కాదు, తెవికీ సంప్రదాయాన్ని అనవసర వ్యాఖ్యగా కామెంట్ చేయడం తెవికీ అభివృద్ధికి నిబద్ధులైన వారందరూ బాధపడవసిందే. బొమ్మ చర్చాపేజీలోనే వ్రాసేవాడిని కాని ఆ సమయంలో చురుకుగా లేని సభ్యుడి దృష్టికి ఆ వ్యాఖ్యను తేవడం అంతకన్నా దగ్గరిమార్గం లేదు. అయిననూ ఎవరి పొరపాటో, ఎవరి బొమ్మ చర్చనో ఆ సభ్యుడికి తెలియజేయలేను. అతడి బొమ్మ, అతడి పొరపాటును అతడి చర్చాపేజీలో వ్రాయడం గురించి నేను చేసింది సమంజసమేనని ఇప్పటికీ భావిస్తున్నాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలిసిందే. ఆ సభ్యుడికి ఎలా చెప్పిననూ అర్థం కావడం లేదు. తాను చేసిందే సరైనదనే భావనతో ఉన్నాడు. నేను పాలసీలను చెప్పడమే అతడికి నచ్చడం లేదు, పైగా నాపై విమర్శలు చేస్తున్నాడు. అయిననూ నాకెలాంటి బాధలేదు. ఒక బృహత్కార్యంలో ఇలాంటి అలజడులు, విమర్శలు మామూలే, అసలు ఇలాంటివి పట్టించుకుంటే మనం సాఫీగా గమ్యం చేరలేము. నా ఓర్పు, సహనం గురించి అతడు చెప్పేపనిలేదు. అతడికెంత ఓర్పుందో అందరూ చూస్తున్నారు. బొమ్మను తొలిగించినవెంటనే అంతెత్తున లేవడమెందుకు? నిజానికి అతడికి ఒకవేళ సహనం ఉండి ఉంటే గనుక ఆ పనిచేసేవాడే కాదు, నాపై విమర్శలు గుప్పించేవాడేకాదు. అతడికి లేని సహనం గురించి ఎదుటివారికి చెప్పడం దేనికి? సామాన్య సభ్యులమీద కోపతాపాలు, అనుచిత బాష అంటున్నాడు. అసలు నా బాష అర్థం చేసుకుంటున్నాడా? కేవలం ఏకవచనం దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా చెప్పడం దేనికి? అయిననూ ఏకవచనం తప్పు కాదని మరోసారి చెప్పుతున్నాను. నాపై లేని విమర్శలు గుప్పించి పదేపదే చెప్పడం దేనికి? ఇంత అహంకారం పనిరాదు. నా గురించి నేను ఇదివరకే చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పడం బాగుండదు. అసలు ఎవరి మీద చర్య తీసుకోవాలి? తప్పంతా అతడిలో ఉంచుకొని నాపై ఫిర్యాదా? మళ్ళీ పెద్ద సహనం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. కేవలం పాలసీలు, సంప్రదాయాల గురించి చెబితే భరించలేకపోతున్నాననడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇలా ఒక్కో పదం, వాక్యంపై నేను వివరణ ఇచ్చుకోగలను, అయిననూ దాని అవసరం లేదు, ఎందుకంటే ఆ విషయాలు సభ్యులందరికీ తెలిసినవే. ఇక చివరగా వైజాసత్యగారికి తెలియజేయడం ఏమనగా నేను చర్చను ఇదివరకే ముగించాను. ఆ సభ్యుడి రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే మళ్ళీ చర్చ పొడిగించాల్సి వచ్చింది. అయిననూ మీ మనవిని దృష్టిలో ఉంచుకొని ఇక ఈ చర్చను మరోసారి ముగించాలనుకుంటున్నాను. అయిననూ తుది ఫలితం ఆ సభ్యుడి ప్రవర్తనపైన ఆధారపడి ఉంటుంది. నాకు ప్రత్యక్షంగాకాని, పరోక్షంగాకాని, విమర్శనాత్మకంగాకాని, రెచ్చగొట్టేవిధంగా కాని వ్యాఖ్యలుచేస్తే నేనూ దానికి తగిన విధంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 22:08, 29 ఏప్రిల్ 2009 (UTC)
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 12".