రాజసులోచన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==సినీ జీవితం==
స్టేజీ మీద రాజసులోచన నాట్య ప్రదర్శన చూసి కొందరు నిర్మాతలు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. ఇలా [[కన్నతల్లి]] చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అంతకు ముందు 'గుణసాగరి' అనే కన్నడ చిత్రంలో, 'సత్యశోధనై' అనే తమిళ చిత్రంలో నటించారు. తొలిసారి హీరోయిన్ గా ఎన్.టి.ఆర్. సరసన ఘంటసాల నిర్మించిన [[సొంతవూరు]] (1956) చిత్రంలో నటించింది. తన చిత్రాలకు నృత్య దర్శకులైన [[పసుమర్తి కృష్ణమూర్తి]], [[వెంపటి పెదసత్యం]], [[వెంపటి చినసత్యం]], జగన్నాథశర్మ మొదలైన వరివారి వద్ద కూచిపూడి నృత్యంలోని మెళకువలు నేర్చుకున్నారు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాల్లో కలిపి దాదాపు 275 చిత్రాల దాకా అందరు మేటి నటుల సరసన నటించారు. ప్రతి భాషలోను తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు.
 
==నృత్య కళాకేంద్రం==
"https://te.wikipedia.org/wiki/రాజసులోచన" నుండి వెలికితీశారు