అహింస: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఒక [[జీవి]]ని చంపడం, ఒకరికి ఇష్టము లేని కార్యాన్ని బలవంతంగా చేయించి, తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాక్కాయ కర్మలచేత బాధ కలిగించడం [[హింస]]. సర్వకల సర్వావస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస.
 
హింస మూడు రకాలు: [[మానసిక హింస]], [[వాచిక హింస]] మరియు [[కాయిక హింస]]. పరులకు హాని తలపెట్టడం, మనో నిగ్రహం లేకపోవడం, పాపభీతి లేకుండా ప్రవర్తించడం అనేవి మానసిక హింస. అసత్యాన్ని పలకడం, అహితముగా లేదా కఠినంగా మాట్లాడడం వాచిక హింస. ఒక జీవిని చంపడం, గాయపరచడం, దుష్క్రియలచేత పీడించడం, పరస్త్రీ సహవాసం, పరధనాపహరణం, మాంస భక్షణ కాయిక హింస అనబడతాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అహింస" నుండి వెలికితీశారు