భువనచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

విస్తరించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఆయన పనిచేశాడు. సరిహద్దు గ్రామాల్లోంచి వెళుతున్నపుడు ప్రజలు ఇచ్చే రొట్టెలు, యుద్ధం చేసి తిరిగి వస్తుంటే దారిపొడవునా సెల్యూట్‌లు, పంజాబీ మరియు గుజరాతీ మహిళలు కట్టిన రాఖీలు ఆయనకు అపురూపమైన సగర్వంగా గుర్తుంచుకోగలిఏ జ్ఞాపకాలు. ఎయిర్‌ఫోర్స్ లో ఉండగానే చిన్న చిన్న వ్యాసాలు, కథలు రాసి వివిధ పత్రికలకు పంపేవాడు. ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళూ పుస్తక పఠనం వదల్లేదు. సర్వీసులో ఉండగా దాదాపు నాలుగువేల పాటలు రాశాడు. ఎయిర్‌ఫోర్స్ లో పద్దెనిమిదేళ్ళు తర్వాత సర్వీసు పూర్తయింది. పన్నెండు వేల జీతంతో ఓఎన్‌జీసీ లో ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ సినీ రచయిత కావాలన్న బలమైన కోరికవల్ల ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి అవకాశాల కోసం మద్రాసు బయలుదేరాడు.
 
అలా మద్రాసు చేరిన ఆయన్ను [[చంద్రమోహన్ ]]మొదట [[జంధ్యాల]] ఇంటికి తీసుకునివెళ్ళారు. ఆయన తీస్తున్న పడమటిసంధ్యారాగం సినిమాకు అవకాశం ఇస్తామన్నారు కానీ దురదృష్టవశాత్తూ అందులో ఆయన ఒక్కపాటా రాయలేకపోయారు. ఆ తర్వాత [[విజయ బాపినీడు]] ని కలిసి ”నాకూ పెళ్ళాం కావాలి” అనే సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. [[ఖైదీ నంనెం. 786 ]] లో ఆయన రాసిన ”గువ్వా... గోరింకతో...” అనే పాట ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత [[గ్యాంగ్ లీడర్]], [[ఘరానా మొగుడు]], [[పెద్దరికం]] మొదలైన హిట్ సినిమాలకు పాటలు రాశాడు. ఇటీవల [[రజనీకాంత్]] నటించిన [[చంద్రముఖి]] సినిమాలోని ”రారా.. సరసకు రారా..” అనేపాట అత్యంత ప్రేక్షకాధరణ పొందింది.
 
ఆయన భార్య శేషసామ్రాజ్య లక్ష్మి, కొడుకు శ్రీనివాస్. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు. అనిమల్ ప్లానెట్‌ను అమితంగా ఇష్టపడే ఆయన అందులో ప్రకృతిలో మనతో సహజీవనం చేస్తున్న జంతువులు, పక్షుల గురించి తెలుసుకోవడమంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎనిదిన్నరేళ్ళ వయసులో చదివిన ఒక కథ ప్రభావంతో ఆయన అప్పటి నుంచీ మాంసాహారాన్ని పూర్తిగా మానివేశాడు.
"https://te.wikipedia.org/wiki/భువనచంద్ర" నుండి వెలికితీశారు