డి. వై. సంపత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్ర జాలరి -జానపద నృత్యకళాకారుడు
 
ఆంధ్ర జాలరి సృష్టి
పంక్తి 4:
 
పేదల శరీర కష్టానికి భాష్యం చెప్పే ఈ దృశ్యం- ఆంధ్ర, ఆంధ్రేతర రంగస్థలాల మీద అవతరించి,ఒక ప్రత్యేకతను సంతరించుకుని జానపద నృత్యరీతికి ప్రోదిచేసింది .అతి సామాన్యంగా కనిపించే ఈ దృశ్యం నృత్యనాటిక రూపాన్ని పొందింది సంపత్ కుమార్ మనస్సులో.కాగా,ఆంధ్రా జాలరికి పర్యాయ పదంగా సంపత్ కుమార్, ఆయనకు బిరుదుగా "ఆంధ్ర జాలరి" కలగలిసిపోయారు.
 
ఆంధ్ర జాలరి సృష్టి
1957వ సంవత్సరం న్యూఢిల్లీలో ప్రజా నాట్యమండలి ఐ.పి.టి.ఏ. వారి అధ్వర్యంలో అఖిల భారత నృత్య పోటీలు జరిగాయి . ప్రజా నాట్యమండలి ఉద్యమకర్త ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడైన గరికిపాటి రాజారావు , సంపత్ కుమార్‌ను ఆ పోటీల్లో పాల్గొనమని ప్రేరేపించాడు. అయితే కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కలిగించారు . సాధారణంగా ఒక నృత్యం ప్రదర్శించాలంటే చాలా మంది సహకారం అవసరమవుతుంది. అటువంటిది కేవలం ఇద్దరితో ఏ అంశం చేయాలో అనే ఆలోచనలో పడ్డ సంపత్ కుమార్‌కి సరోజిని నాయుడు వ్రాసిన " కోరమండల్ ఫిషర్స్" అనే ఆంగ్ల కవిత మదిలో మెదిలింది. ఆ ఆలోచన అతన్ని భీమిలికి తీసుకుపోయింది. అక్కడ సముద్ర తీరాన సాగరమే సంసారంగా, దినదిన గండంగా దినాలు గడిపే నిరుపేద జాలరుల జీవన సమరాన్ని, భావగర్భితంగా ఏ సాహిత్యము లేకుండా కేవలం " మైమ్ " తో ప్రదర్శించే మహత్తర భావం రూపుదాల్చుకుంది. అవసరార్థం, పోటీకొరకు, సరదాగా కూర్చిన ఈ నృత్యం ఇతి వృత్తపరంగాను , సాంకేతికపరం గాను అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. కేవలం తబలా శబ్ద తరంగాలతో, అలలు, తూఫాను హోరు, ఉరుములు, మెరుపుల సృష్టితో , ప్రేక్షకుల్ని మైమరిపింపజేసే ఈప్రత్యేక తరహా నృత్య రూపకం అవతరించి, ఒక అధ్బుతమైన కళాఖండమై విరాజిల్లింది.
"https://te.wikipedia.org/wiki/డి._వై._సంపత్_కుమార్" నుండి వెలికితీశారు