హవేలీ సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

చి హవేలీ సంగీతం
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హవేలీ సంగీతం''' : [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణ]] ఆరాధనలో భాగమైన ప్రాచీన హవేలీ సంగీతానికి మళ్ళీ ఊపిరి పోయడంలో, [[అహ్మదాబాద్]] లోని'' అష్టచావ కీర్తన సంగీత విద్యాపీఠం'' గురువు ''విఠల్‌దాస్ బాపోద్రా'' ఎంతో కృషి చేశాడు.
 
పుష్టిమార్గ వైష్ణవ శాఖను స్థాపించిన మధ్యయుగాలనాటి మతాచార్యుడైన శ్రీ వల్లభాచార్య కుమారుడు, శ్రీ విఠలేశ్ ( 1556 - 1698 ) దాదాపు 500 ఏళ్ళ క్రితం ఈ హవేలీ సంగీతాన్ని ప్రారంభించాడు. ద్రుపద్, ధమార్, ఠుమ్రీ లాంటి సాంప్రదాయిక విధానాల ఆధారంగా రూపొందిన గానశైలి ఈ హవేలీ సంగీతం. పుష్టిమార్గ వైష్ణవ శాఖ వారు శ్రీకృష్ణుడి ఆలయాలను సాంప్రదాయికంగా ''హవేలీ'' అని పిలుస్తుంటారు. దాని నుంచే దీనికి ''హవేలీ సంగీతం'' అని పేరు వచ్చింది. శ్రీ కృష్ణ పరమాత్ముణ్ణి కీర్తించే గీతాలన్నీ వ్రజ భాషలో ఉంటాయి. శ్రీకృష్ణుడు పుట్టి పెరిగినట్లగా భావిస్తున్న ''వ్రజ్‌ప్రదేశ్'' ప్రాంతంలో వాడే భాష అది. శ్రీ విఠలేశ్‌కు ఉన్న ఎనిమిది మంది ప్రధాన శిష్యులలో ఒకరైన [[సూర్ దాస్]] దాదాపు 1.25 లక్షల గీతాలు రచించాడు. కాని వాటిలో 33 వేలు మాత్రమే ఇప్పుడు లభ్యమవుతున్నాయి.
 
విద్యార్థులు ఎంత ముఖ్యమో ఈ ప్రాచీన సంగీత పునరుద్ధరణకు భూరి విరాళాలిచ్చే దాతలూ అంతే ముఖ్యం. నిజానికి [[ముంబై]] కి చెందిన థాకర్‌సేలు, ఖటావ్‌లు, అంబానీలు - వీరంతా పుష్టిమార్గీ కుటుంబాలకు చెందిన వారే. " గతంలో కొన్ని కుటుంబాల పూర్వీకులు హవేలీ సంగీతానికి మహరాజ పోషకులుగా నిలిచారు. " అని విఠల్‌దాస్ బాపోద్రా తెలిపాడు.
 
== మూలం ==
"https://te.wikipedia.org/wiki/హవేలీ_సంగీతం" నుండి వెలికితీశారు