"ఖుషి" కూర్పుల మధ్య తేడాలు

1,307 bytes added ,  11 సంవత్సరాల క్రితం
 
==కథ==
[[కలకత్తా]] లోని ఒక ధనిక కుటుంబానికి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్, ఉన్నత విద్య కోసమై [[కెనడా]] బయలు దేరుతాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారి లో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. విదేశీ విద్యావకాశం చేజారటం తో [[హైదరాబాదు]] లో నే ఒక[[ఉస్మానియా కళాశాలలోవిశ్వవిద్యాలయం]]లో చేరతాడు. [[కైకలూరు]] లోని ఉన్నత కుటుంబానికి చెందిన మధుమిత కి జరగవలసిన పెళ్ళిచూపుల్లో వరుడు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నాని లేఖ రాయటంతో ఆ పెళ్ళి చూపులు రద్దు అవుతాయి. ఉన్నత విద్య అంటే ఎంతో ఇష్టపడే మధు కూడా అదే కళాశాలలోవిశ్వవిద్యాలయం లో అతనికిసిద్ధుకి పరిచయం అవుతుంది. వీరిరువురి స్నేహితులు ప్రేమికులు కావటం తో వారి ప్రేమ కి సాయపడటంలో సిద్ధూ, మధు ఒకరికొకరు దగ్గరవుతారు. మనసులో ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నా దానిని ఒకరికొకరు వ్యక్తీకరించుకోని గంభీర స్వభావులు వీరిరువురు.
 
తన దూకుడు స్వభావం వలన సిద్ధూ మధు మనసులో స్థానం కోల్పోతాడు. మాటా మాటా పెరిగి తన లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవలసి వస్తే, తనకి ఆ పెళ్ళి ఇష్టం లేదని ఉత్తరం రాసి పారిపోతానన్న సిద్ధు మాటలకి నొచ్చుకొంటుంది మధు. మొండితనం తో మధు సిద్ధూ కి మరింత దూరం అవుతుంది. కానీతాము స్నేహితులు కామని, తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని ప్రేమ జంటని కలపటానికి మాత్రమే తాము ప్రయత్నిస్తున్నామని మాటి మాటికి సిధ్ధు కి గుర్తు చేస్తు ఉంటుంది మధు. ఇరువురి తోడ్పాటు తో ప్రేమ జంట ఏకం అవుతుంది.
 
విడదీసిన విధే సిద్ధూ, మధు లను ఎలా కలిపింది? సిద్ధూ, మధులు వారి వారి స్వభావాలని అధిగమించారా, లేదా? వివాహానంతరం సిద్ధూ, మధు లు జీవితాన్ని ఎలా గడపబోతారు?? అన్న ప్రశ్నలకు సమాధానమే చిత్రానికి శుభం కార్డు.
10,319

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/408735" నుండి వెలికితీశారు