ఆర్య (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==కథ==
గీత ([[అనూ మెహతా]]) [[కన్యాకుమారి]] కి స్నేహితులతో విహారయాత్రకి వస్తుంది. అక్కడ సముద్రపు ఒడ్డున ఒక పుస్తకంలో ఒక యువకుడు తన స్వప్నసుందరి కి రాసిన కవితను మెచ్చిన గీత, ఆ యువకుడికి ఆ అమ్మాయి త్వరలోనే దొరుకుతుందిదొరకాలని అనిఆశిస్తున్నానని రాసి వెళ్ళిపోతుంది. ఆ యువకుడు గీతని కాని, గీత ఆ యువకుడిని కాని ఎరుగరు. వంతెన పై నిలబడి సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న గీతని కొందరు ఆకతాయిలు ఆట పట్టిస్తూ గీత కోసం చావటానికైనా సిద్ధం అని అంటారు. ఇంతలో గీత కాలి పట్టీ ఒకటి జారి సముద్రం లో పడిపోతుంది. ఆ ఆకతాయిలకు బుధ్ధి చెప్పాలన్న ఉద్దేశ్యంతో గీత స్నేహితురాలు "మీరు చావక్కర్లేదు. నిజంగా ప్రేమ ఉంటే ఆ పట్టీ తెచ్చివ్వండి చాలు" అని అంటుంది. ఇంతలో వేరొక యువకుడు దభాల్న సముద్రంలోనికి దూకేస్తాడు. ఈ దృశ్యం తన మనసు లోతుల్లో ముద్రించుకుపోవటంతో గీతకి తరచు అది కలగా వస్తూ ఉంటుంది.
 
అజయ్ ([[శివ బాలాజి]]) MP అవతారం ([[రాజన్ పి. దేవ్]]) కొడుకు. కాలేజిలో చదువుతున్నాడుచదువుతుంటాడు. అదే కాలేజీలో గీతని ప్రేమిస్తాడు. తను కాదంటే కాలేజి మీదనుండి దూకి చస్తానని బెదిరిస్తాడు. తాను ప్రేమిస్తున్నట్టు చెబితే గాని దిగి రానని దూకబోవటంతో అయిష్టంగానే గీత I love you అని గట్టిగా అరుస్తుంది. కాలేజికి కి అప్పుడే వచ్చిన్వచ్చిన ఆర్య ([[అల్లు అర్జున్]]) అది చూసి గీతని ప్రేమించటం మెదలుపెడతాడు. అజయ్ ముందే గీతకి "ఐ లవ్ యూ" చెప్తాడు. కోప్పడిన అజయ్ తో వారు ప్రేమించుకోవచ్చని కాని అను ని తాను కూడా ప్రేమిస్తున్నాని, ప్రేమిస్తూనే ఉంటానని అయోమయంలో పడేస్తాడు. గీతకి అజయ్ పట్ల నిజంగానే ప్రేమ ఉంటే తన లాంటి వారు ఎందరు వచ్చినా వారిని విడదీయలేరని అతనికి నచ్చచెపుతాడునచ్చజెపుతాడు.
 
గీత స్నేహితురాళ్ళందరూ దబాయించటంతో తాజ్ మహల్ అందరికీ ఇష్టమేనని ఒకరు ఇష్టపడుతున్నారు కదా అని మన ఇష్టాన్ని చంపుకోలేమని, గీత పై తన ఇష్టం కూడా అలాంటిదే నని, ప్రశ్నించటం మాని ప్రేమించటం మొదలు పెట్టండని హితబోధ చేస్తాడు.
"https://te.wikipedia.org/wiki/ఆర్య_(సినిమా)" నుండి వెలికితీశారు