వరుణ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
వరుణ్ గాంధీని హత్య చేయడానికి ఛోటాషకీల్ అనుచరుడు కుట్రపన్నినట్లు మార్చి మూడవవారంలో నిఘా అధికారులు పసిగట్టిన ఫోన్ సంభాషణల ద్వారా బయటపడింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 05.04.2009</ref> మార్చి 27న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో వరుణ్‌పై దాడిజరిగే అవకాశాలున్నాయని కూడా హెచ్చరించింది. మార్చి 28న వరుణ్ గాంధీ ఢిల్లీ నుంచి ఫిలిబిత్ కోర్టులో లొంగిపోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ హత్యచేయడానికి వేసిన పథకం విఫలమైంది.
==20 రోజుల జైలు జీవితం==
ఇటా జైలులో వరుణ్ గాంధీ గడిపిన 20 రోజుల జైలు జీవితం వ్యక్తిగతంగా మంచి ఇమేజ్‌ను సాధించిపెట్టింది. రాజకీయ సోపానంలో అనేక మెట్లను ఒక్క ఉదుటున ఎక్కేశాడు. యువ రాజకీయ నాయకుడిగా దేశమంతటా పరిచయమయ్యాడు. పార్టీలోనూ ఈ విషయంపై వరుణ్‌కు హోదా పెరిగింది. అగ్రనేతలతో సమంగా ప్రాధాన్యత పెరిగింది. ఇదే విషయమై "ఒక వ్యక్తికి జీవితంలో ఇలాంటి అవకాశం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది" అని పిలిభిత్ జిల్లా భారతీయ జనతా పార్టీ అద్యక్షుడు యోగేంద్ర గంగ్వార్ పేర్కొన్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 10-05.2009</ref> కొత్త ఇమేజ్ కారణంగా సభలు, సమావేశలలో వరుణ్ ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/వరుణ్_గాంధీ" నుండి వెలికితీశారు