ఈత (వ్యాయామం): కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: lv:Peldēšana
చి యంత్రము కలుపుతున్నది: diq:Asnaw kerdış; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Fileఫైలు:Front Crawl 4704.JPG|thumb|right|200px|పోటీలో ఈతకొడుతున్న క్రీడాకారుడు]]
'''ఈత''' ఒక రకమైన [[వ్యాయామం]] మరియు [[క్రీడ]]. దీని వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ఈత ఒంటికి మంచి వ్యాయామాన్నిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈతాడుతూ స్నానం చేయవచ్చు. ఆటలు ఆడవచ్చు, చేపలు పట్టవచ్చు మరియు ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించవచ్చు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోతే ఆత్మ రక్షణ చేసుకోవచ్చు. చేపలు మొదలైన చాలా [[జంతువు|జలచరాలు]] నీటిలో ఈదగలుగుతే, [[మనుషులు]] ఈత నేర్చుకోవలసివుంటుంది.
 
== చరిత్ర ==
ఈతను గురించిన ప్రస్తావన చరిత్ర పూర్వం నుంచే ఉంది. 7000 సంవత్సరాల క్రితం రాతియుగానికి చెందిన కాలానికి చెందిన చిత్రకళ ద్వారా దీనిని మొట్టమొదటగా రికార్డు చేశారు. 1896 లో [[ఏథెన్స్]] లో జరిగిన మొట్టమొదటి [[ఒలంపిక్ పోటీలు|ఒలంపిక్ పోటీల్లో]] ఈత పోటీలు కూడా ఒక భాగం.
 
== ఈత పోటీలు ==
ఈత పోటీల్లో ప్రధానంగా జరిగేవి వేగానికి సంబంధించినవి. ఈ పోటీల్లో ఒక ఖచ్చితమైన దూరాన్ని ఎవరు ముందుగా ఈదగలరో వారు గెలిచినట్లు లెక్క. ఈ పోటీలు 19 వశతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ పోటీల్లో 36 విభాగాలుంటాయి. వీటిలో 18 పురుషుల కోసం, 18 స్త్రీల కోసం నిర్వహించబడతాయి.
మొదటి నాలుగు ఒలంపిక్ పోటీల్లో ఈత పోటీలను ఈతకొలనుల్లో నిర్వహించలేదు. ఓపెన్ గా ఉన్న సముద్ర జలాల్లో నిర్వహించే వారు.
 
== వృత్తి ==
చేపలు పట్టే వారు, ముత్యాల కోసం సముద్ర గర్భంలో అన్వేషించే వారు ఈతను తమ వృత్తిగా స్వీకరిస్తారు. ఈతలో అంత అనుభవం లేని కొందరు ప్రమాదంలో ఉంటే గజ ఈత గాళ్ళు వారిని రక్షిస్తారు. వీరికి కూడా ఈత ప్రధాన వృత్తే. అమెరికాలో చాలా నగరాల్లో ఇలాంటి ప్రమాదాలనుంచి రక్షించడానికి సుశిక్షితులైన గజ ఈతగాళ్ళ బృందాలు ఉంటాయి. ఉదాహరణకు లాస్ ఏంజిలస్ నగరంలో [http://lacitylifeguards.pyroinnovations.com/ లాస్ ఏంజిలస్ లైఫ్ గార్డ్స్] అనే బృందం.
 
== అపాయాలు ==
ఈతలో సాధారణంగా ఎక్కువ అపాయమైనది నీళ్ళలో మునిగిపోవడం. ఎక్కువగా నీళ్ళు తాగడం వలన కడుపు ఉబ్బి శ్వాస ఆడక చనిపోవడం జరుగుతుంది.
సాధారణంగా పల్లెటూర్లలో చెరువుల్లో ఈత ఆడడానికి వెళుతుంటారు. అలాంటప్పుడు చెరువుల్లోని బురుద కుంటల్లో (ఊబి). కూరుకు పోయి ఈత తెలిసిన వారు కూడా ప్రాణాలు కోల్పేయే అవకాశం ఉంది.
పంక్తి 19:
నదుల్లో ఈదేటప్పుడు ప్రవాహం వేగం ఎక్కువైతే కూడా కొట్టుకుపొయే ప్రమాదం ఉంది.
 
== వస్త్రధారణ ==
సాధారణంగా మనం వాడే [[దుస్తులు]] ఈతకు అంత సౌకర్యంగా ఉండవు. అంత సురక్షితమైనవి కూడా కావు. అందుకనే ప్రస్తుతం ఈత కోసం ఇప్పుడు ప్రత్యేక దుస్తులు వాడుతున్నారు. ఇవి శరీరానికి అతుక్కొని, నీరు పీల్చుకొనేటట్టుగా ఉంటాయి.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:క్రీడలు]]
Line 37 ⟶ 36:
[[da:Svømning]]
[[de:Schwimmsport]]
[[diq:Asnaw kerdış]]
[[el:Κολύμβηση]]
[[eo:Naĝado]]
"https://te.wikipedia.org/wiki/ఈత_(వ్యాయామం)" నుండి వెలికితీశారు