రోహిణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: +మూలాలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Rohini in Navamohini.jpg|right|thumb|నవమోహినిలో రోహిణి]]
'''ఆర్.రోహిణి''', దక్షిణ భారత సినిమా నటి. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి [[తెలుగు]], [[తమిళం]], కన్నడ[[కన్నడం]] మరియు మళయాళంలలో[[మళయాళం]] భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. [[నవమోహిని]] లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు. రోహిణి సినీ నటుడు [[రఘువరన్]] ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది. కానీ ఈ వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయినది.
 
ప్రతిభావంతమైన వ్యక్తి అయిన రోహిణి ఆ తర్వాత సామాజిక సేవ కార్యక్రమాలు మరియు టీవీ కార్యక్రమాలలో నిమగ్నమైనది. చాలా వ్యవధి తర్వాత [[కమల్ హాసన్]] సినిమా [[పోతురాజు]] (తమిళంలో విరుమాండి)లో, అయ్యన్ (తమిళం)లో నటించింది. పోతురాజు సినిమాలో ఒక పరిశోధకురాలి పాత్రలో కనిపించింది.
1995లో [[పాలగుమ్మి పద్మరాజు]] కథ ఆధారముగా [[కె.ఎస్.సేతుమాధవన్]] నిర్మించిన [[స్త్రీ (1995 సినిమా)|స్త్రీ]] సినిమాలో ముఖ్యపాత్రను పోషించిన రోహిణి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది.
 
రోహిణి [[ఎయిడ్స్]] వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నది.<ref>http://www.hindu.com/mp/2004/01/07/stories/2004010700480400.htm</ref><ref>http://www.hinduonnet.com/thehindu/mp/2005/11/26/stories/2005112600660400.htm</ref> స్వయంగా బాల్యనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రోహిణి బాల్యనటుల అంతరంగంపై "సైలెంట్ హ్యూస్" అనే 52 నిమిషాల నిడివి కల డాక్యుమెంటరీని నిర్మించి దర్శకత్వం వహించింది<ref>http://www.hindu.com/2008/01/09/stories/2008010957170200.htm</ref><ref>http://www.indianfilmfestival.org/movies08/silenthues.html</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రోహిణి_(నటి)" నుండి వెలికితీశారు