బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==పండుగలు==
అన్ని పండుగలను భక్తి శ్రధ్దలతో జరుపుకుందురు. ముఖ్యమైన పండుగలు కనక దుర్గ జాతర, దసరా, సంక్రాంతి, శ్రీ రామ నవమి, శివ రాత్రి మరియు ముక్కోటి ఏకాదశి. వీటిలో కనక దుర్గ జాతర అనేది గ్రామ పండుగ. ప్రతి సంవత్సరం మహా శివ రాత్రికి ముందు ఈ జాతర వచ్చును. ఏ రోజున ఈ పండుగ జరుపుకోవాలి అనేది గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. శ్రీ రామ నవమికి రాముని కళ్యాణం చేసి కళ్యాణానికి వచ్చిన భక్తులకు పానకం పులిహోరను ప్రసాదముగా పంచుతారు. మహా శివ రాత్రికి శివాలయంలో శివుని కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును. దసరా పండుగను కూడా చాలా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.దసరా పండుగకు తొమ్మిది రోజుల మందు నుండి బ్రతుకమ్మ ఆటను ప్రారంభిస్తారు.బ్రతుకమ్మ పండుగ అనేది తెలంగాణా ప్రాంతంలో మాత్రమే జరుపుకుంటారు. పూలను ప్లేటుపై గుండ్రంగా పేరుస్తూ పైకి వెళ్లిన క్రొద్దీ వ్యాసం తగ్గిస్తూ పేర్చుతారు. ఇలా పేర్చిన పూలని బ్రతుకమ్మ అని అంటారు. ఇలా అందరూ చేసిన బ్రతుకమ్మలను ఒక చోట ఉంచి దాని చుట్టూ బ్రతుకమ్మ పాటలు పాడుతూ తిరుగుతారు. ఈ ఆటను మహిళలు మాత్రమే ఆడుతారు.ఈ ఆటను పెళ్ళిల్లు కాని అమ్మాయిలు కూడా ఆడుతారు. మొదటి రోజు నుండి రోజుకి కొంత ఎత్తు చొప్పున బ్రతుకమ్మ ఎత్తును పెంచుతూ తొమ్మిదవ రోజుకి చేరుకొనే సరికి బ్రతుకమ్మ పెద్దగా అవుతుంది. తొమ్మిదవ రోజున ఎవరు పెద్ద బ్రతుకమ్మను చేస్తారు అని ఊరి జనం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
 
{{చిలుకూరు (నల్గొండ జిల్లా) మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:నల్గొండ జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు