బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==ఆదాయ వనరులు==
బేతవోలు గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం [[వ్యవసాయం]] మరియు వ్యవసాయ సంబంద పనులు. ఈ గ్రామంలో ప్రధాన వ్యవసాయ పంట [[వరి]]. ఈ గ్రామంలో పండించిన వరి ధాన్యానికి మంచి ధర లభించును.ఇక్కడ పండించిన ధాన్యం ఇతర రాష్త్రాలకు ముఖ్యంగా తమిళనాడు లోని చెన్నై నగరమునకు ఎగుమతి అగును. గ్రామంలోని రైతులు వ్యవసాయం ద్వారానే కాక పాలు, కూరగాయలు అమ్మటం ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటారు.గ్రామంలో రెండు చెరువులు ఉండటం వలన బెస్త వారు (గంగ పుత్రులు)చేపలు పట్టటం కూడా చేస్తూ ఉంటారు. గ్రామానికి తూర్పున పెద్ద చెరువు పడమరన చిన్న చెరువు ఉన్నాయి. పెద్ద చెరువును వీర్ల దేవి చెరువు అని అంటారు. వీర్ల దేవి చెరువు నిర్మాణం జరిగి 100 సంవత్సరములు దాటినది. దీని క్రింద దాదాపు 1500 ఎకరముల వ్యవసాయ భూమి సాగు అవుచున్నది.చిన్న చెరువు క్రింద దాదాపు 200 ఎకరముల దాకా వ్యవసాయ భూమి సాగు అవుచున్నది.
 
==విద్య మరియు పాఠశాలలువిద్యాలయాలు==
బేతవోలు గ్రామంలో సగానికి పైగా ప్రజలు చదువుకున్నవారే. ఈ గ్రామస్థులు చాలామంది వివిద ఉద్యోగాలలో చేరి రాష్త్రంలో వేరు వేరు ప్రాంతాలలో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ గ్రామస్థులు సాఫ్ట్ వేర్, మేనేజ్ మెంట్, పోలీసు, బోధనా వృత్తులలో స్థిర పడిన వారు ఉండటం చెప్పుకోదగ్గ విషయం. బేతవోలు గ్రామంలో ఒక ప్రభుత్వ ఉన్నత విద్యా పాఠశాల, ఒక ప్రైవేటు ఉన్నత విద్యా పాఠశాల, ఒక ప్రభుత్వ ప్రాథమిక విద్యా పాఠశాల, ఐదు ప్రైవేటు ప్రాథమిక విద్యా పాఠశాలలు మరియు ఒక అంగన్ వాడి పాఠశాల కలవు.
 
పంక్తి 23:
 
==పండుగలు==
అన్ని పండుగలను భక్తి శ్రధ్దలతో జరుపుకుందురు. ముఖ్యమైన పండుగలు కనక దుర్గ జాతర, దసరా, సంక్రాంతి, శ్రీ రామ నవమి, శివ రాత్రి మరియు ముక్కోటి ఏకాదశి. వీటిలో కనక దుర్గ జాతర అనేది గ్రామ పండుగ. ప్రతి సంవత్సరం మహా శివ రాత్రికి ముందు ఈ జాతర వచ్చును. ఏ రోజున ఈ పండుగ జరుపుకోవాలి అనేది గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. శ్రీ రామ నవమికి రాముని కళ్యాణం చేసి కళ్యాణానికి వచ్చిన భక్తులకు పానకం పులిహోరను ప్రసాదముగా పంచుతారు. మహా శివ రాత్రికి శివాలయంలో శివుని కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును.

దసరా పండుగను కూడా చాలా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.దసరా పండుగకు తొమ్మిది రోజుల మందు నుండి బ్రతుకమ్మ ఆటను ప్రారంభిస్తారు.బ్రతుకమ్మ పండుగ అనేది తెలంగాణా ప్రాంతంలో మాత్రమే జరుపుకుంటారు. పూలను ప్లేటుపై గుండ్రంగా పేరుస్తూ పైకి వెళ్లిన క్రొద్దీ వ్యాసం తగ్గిస్తూ పేర్చుతారు. ఇలా పేర్చిన పూలని బ్రతుకమ్మ అని అంటారు. ఇలా అందరూ చేసిన బ్రతుకమ్మలను ఒక చోట ఉంచి దాని చుట్టూ బ్రతుకమ్మ పాటలు పాడుతూ తిరుగుతారు. ఈ ఆటను మహిళలు మాత్రమే ఆడుతారు.ఈ ఆటను పెళ్ళిల్లు కాని అమ్మాయిలు కూడా ఆడుతారు. మొదటి రోజు నుండి రోజుకి కొంత ఎత్తు చొప్పున బ్రతుకమ్మ ఎత్తును పెంచుతూ తొమ్మిదవ రోజుకి చేరుకొనే సరికి బ్రతుకమ్మ పెద్దగా అవుతుంది. తొమ్మిదవ రోజున ఎవరు పెద్ద బ్రతుకమ్మను చేస్తారు అని ఊరి జనం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
{{చిలుకూరు (నల్గొండ జిల్లా) మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:నల్గొండ జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు