బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==ఆదాయ వనరులు==
బేతవోలు గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం [[వ్యవసాయం]] మరియు వ్యవసాయ సంబంద కూలీ పనులు. ఈ గ్రామంలో ప్రధాన వ్యవసాయ పంట [[వరి]]. ఈ గ్రామంలో పండించిన వరి ధాన్యానికి మంచి ధర లభించును.ఇక్కడ పండించిన ధాన్యం ఇతర రాష్త్రాలకు ముఖ్యంగా తమిళనాడు లోని చెన్నై నగరమునకు ఎగుమతి అగును. గ్రామంలోని రైతులు వ్యవసాయం ద్వారానే కాక పాలు, కూరగాయలు అమ్మటం ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటారు. గ్రామంలో రెండు పాల కేంద్రాలు కలవు. ఈ గ్రామం యొక్క రెవెన్యూ మండలంలోని మిగతా గ్రామాలన్నింటి కన్నా ఎక్కువ.
 
గ్రామంలో రెండు [[చెరువు]]లు ఉండటం వలన బెస్త వారు ([[గంగపుత్రులు]])చేపలు పట్టటం కూడా చేస్తూ ఉంటారు. గ్రామంలోని పెద్ద చెరువులో చేపలు పెంచి అమ్ముకొనుటకు ప్రభుత్వం చెరువుని లీజుకి ఇస్తుంది. ఈ చెరువులో ఇలా పెంచి పట్టిన చేపలను కొల్కొతా (కలకత్తా) నగరానికి ఎగుమతి చేస్తారు. గ్రామానికి తూర్పున పెద్ద చెరువు పడమరన చిన్న చెరువు ఉన్నాయి. పెద్ద చెరువును 'వీర్లదేవి చెరువు' అని అంటారు. వీర్లదేవి చెరువు నిర్మాణం జరిగి 100 సంవత్సరములు దాటినది. దీని క్రింద దాదాపు 1500 ఎకరముల వ్యవసాయ భూమి సాగు అవుచున్నది. చిన్న చెరువు క్రింద దాదాపు 200 ఎకరముల దాకా వ్యవసాయ భూమి సాగు అవుచున్నది.
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు