బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
గ్రామంలో రెండు [[చెరువు]]లు ఉండటం వలన బెస్త వారు ([[గంగపుత్రులు]])చేపలు పట్టటం కూడా చేస్తూ ఉంటారు. గ్రామంలోని పెద్ద చెరువులో చేపలు పెంచి అమ్ముకొనుటకు ప్రభుత్వం చెరువుని లీజుకి ఇస్తుంది. ఈ చెరువులో ఇలా పెంచి పట్టిన చేపలను కొల్కతా (కలకత్తా) నగరానికి ఎగుమతి చేస్తారు. గ్రామానికి తూర్పున పెద్ద చెరువు పడమరన చిన్న చెరువు ఉన్నాయి. పెద్ద చెరువును 'వీర్లదేవి చెరువు' అని అంటారు. వీర్లదేవి చెరువు నిర్మాణం జరిగి 100 సంవత్సరములు దాటినది. దీని క్రింద దాదాపు 1500 ఎకరముల వ్యవసాయ భూమి సాగు అవుచున్నది. చిన్న చెరువు క్రింద దాదాపు 200 ఎకరముల దాకా వ్యవసాయ భూమి సాగు అవుచున్నది.
 
==మౌళిక సదుపాయాలు==
బేతవోలులో దాదాపు ప్రధాన వీధులన్నీ సిమెంటు వీధులుగా మార్చబడ్డాయి. సిమెంటు వీధులుగా మార్చిన వీధులు అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి చెన్నారి గూడెం మలుపు వరకు, గ్రామ పంచాయతి నుండి తోట వరకు, దేవాలయం వీధి, సాలె బజారు, గడీ బజారు, గౌండ్ల బజారు.
గ్రామంలో రక్షిత మంచి నీటి పథకం అమలులో ఉంది. గ్రామంలో ప్రతి వీధిలో మంచినీటి కుళాయిలు కలవు. ఇంటింటికి త్రాగు నీటి కుళాయిల సౌకర్యం కల్పించటం కూడా జరిగింది.
గ్రామంలో మురుగు నీరు పోవుటకు కాలువలు కలవు. కాని వీటి నిర్వహణ దయనీయంగా ఉండటంతో ఊర్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. వీటి నుండి రక్షణ కొరకు గ్రామస్థులు దోమ చుట్టలు, దోమ తెరలకు ఖర్చు పెట్టవలసి వస్తుంది. గ్రామ పంచాయతి సిబ్బందీ నిర్లక్ష వైఖరే దీనికి కారణం.
 
==విద్య మరియు విద్యాలయాలు==
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు