కిక్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ→‎కథ
పంక్తి 23:
మలేషియా బ్యాక్‌డ్రాప్ లో కథ మొదలవుతుంది. నైనా (ఇలియానా) ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ అయిన కళ్యాణ్ కృష్ణ (శ్యామ్-తొలిపరిచయం) పెళ్ళి చూపుల పేరుతో కలుస్తుంది. వారిద్దరికీ ఇంచుమించు సంబంధం కుదురుతుంది. ఇద్దరూ పరిచయం చేసుకునేటప్పుడు అతని పేరులోని కళ్యాణ్ అనే పదాన్ని విని అతనికి తన గతాన్ని గురించి తెలియ జేస్తుంది. ఆమెకు పరిచయమైన కళ్యాణ్ గురించి చెబుతుంది.
కళ్యాణ్ (రవితేజ) బాగా చదువుకున్న కుర్రాడు. తెలివైన వాడు. ఏ ఒక్క ఉద్యోగంలోనూ కొద్ది రోజులు కూడా పనిచేయడు. చేసే ప్రతి పనిలోనూ ''కిక్'' ఉండాలని కోరుకుంటుంటాడు.
 
నిజానికి కళ్యాణ్ ఒక దొంగ. అయితే అతను ఎందుకు దొంగగా మారాడనే దాని వెనుక ఒక ఉదాత్తమైన సంఘటన ఉంటుంది. ఒక చిన్న పాపకు ప్రాణాంతకమైన జబ్బు చేయడంతో ఆ పాప తల్లిదండ్రులు అన్ని విధాలా ప్రయత్నించి ఆమెకు ఆపరేషన్ చేయించలేక, పాప చావును చూడలేమంటూ ఉత్తరం రాసి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఆ సంఘటన కళ్ళారా చూసిన రవితేజ చలించిపోయి ఆ పాపను బ్రతికించడానికి తనకున్న ఆస్థులను తెగనమ్మి ఆపరేషన్ చేయిస్తాడు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆమె కళ్ళలో ఆనందం చూసి ఆమెలాంటి మరెందరో పిల్లలకు వైద్యం చేయించడానికి దొంగతనాలు చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఈ దొంగతనాలు మాత్రం అన్యాయాలు, అక్రమాలు చేసి కోట్లు గడించిన ప్రముఖుల ఇళ్ళలోనే చేస్తుంటాడు.
"https://te.wikipedia.org/wiki/కిక్_(సినిమా)" నుండి వెలికితీశారు