కోన ప్రభాకరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
ప్రభాకరరావు 1983 సెప్టెంబరు 2 న అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న [[పాండిచ్చేరి]] గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆ పదవిలో 1984 జూన్ వరకు కొనసాగి, 1984 జూన్ 17న [[సిక్కిం]] గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత 1985, మే 30 న [[మహారాష్ట్ర]] గవర్నరుగా నియమితుడైనాడు. 1986 ఏప్రిల్లో బొంబాయి విశ్వవిద్యాలయం మార్కుల విషయంలో చేలరేగిన దుమారంలో ఈయన పాత్రపై సంశయం ఏర్పడ్డంతో మహారాష్ట్ర స్పీకరు పదవికి రాజీనామా చేశాడు.<ref>President Shankar Dayal Sharma, the Scholar and the Statesman By Attar Chand పేజీ.46 [http://books.google.com/books?id=iCReqnq6j0oC&pg=PA46&dq=Kona+Prabhakar+rao]</ref>
 
క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకర్ 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్ అయ్యాడు. బాపట్ల మరియు ఇతర ప్రదేశాలలో శివాజీ వ్యాయామ మండలి స్థాపనకు తోడ్పడ్డాడు. పూణేలో కళాశాల రోజుల్లో ప్రభాకర్ [[కుస్తీ]]లు పట్టేవాడు. మరియు బాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయనకు అనేక సాంస్కృతిక సంస్థలతో అనుబంధం ఉన్నది. తొలినాళ్ళలో అనేక [[తెలుగు సినిమా]]లను నిర్మించి, దర్శకత్వం వహించాడు. కొన్నింటిలో స్వయంగా నటించాడు కూడా. ఈయన సినిమాలలో [[మంగళసూత్రం]], [[నిర్దోషి]], [[ద్రోహి]] మరియు [[సౌదామిని]].<ref>[http://www.imdb.com/name/nm0464807/ ఐ.ఎమ్.డి.బి.లో కోన ప్రభాకరరావు పేజీ.]</ref>
 
బాపట్ల శాసనసభ్యునిగా ఉన్నంత కాలం ప్రభాకరరావు బాపట్ల అభివృద్ధికి విశేషంగా కృషిచేశాడు. విద్యారంగంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి సొంతవూరులో అనేక విద్యాసంస్థలు అభివృద్ధి చెందేందుకు దోహదం చేశాడు. కృష్ణా జలాలను బాపట్లకు రప్పించడానికి కృషిచేసి వ్యవసాయరంగానికి దోహదపడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/కోన_ప్రభాకరరావు" నుండి వెలికితీశారు