రామ రాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==పరిపాలన==
రామరాయలు శ్రీరంగరాజు, తిరుమలాంబల కొడుకు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో గొప్ప సేనాధిపతిగా, పరిపాలకునిగా, రాజకీయ తంత్రము తెలిసిన వాడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మామ చనిపోయిన తరువాత రాజకార్యములలో తన ప్రభావము చూపాడు. 1529లో శ్రీకృష్ణదేవరాయల చిన్న తమ్ముడు అచ్యుతరాయలు సింహాసనమెక్కి 1542వరకు పాలించి చనిపోయాడు. పిమ్మట అతని మేనల్లుడు, బాలుడగు సదాశివరాయలు రాజయ్యాడు. రాజ్యాధికారమంతయూ రామరాయల చేతిలోనే ఉన్నది. సదాశివరాయని తొలగించి తానే రాజయ్యే అవకాశముందని కొలువులోని పెక్కుమందికి అనుమానము. కోశాధికారి, మహాయోధుడగు సలకము తిమ్మరాజు రామరాయలని హత్యచేయుటకు ఏర్పాటు చేస్తాడు. ఇది తెలిసి రామరాయలు గందడికోటగండికోట కు పారిపోయి అచట విజయనగరరాజ్యానికి విశ్వాసపాత్రుడగు పెమ్మసాని యెర్ర తిమ్మానాయుని ఆశ్రయము పొందుతాడు. తిమ్మరాజు పెద్ద సైన్యముతో గండికోట వచ్చి రామరాయలను అప్పగించమని తిమ్మానాయుని కోరతాడు. ప్రతిగా తిమ్మానాయుడు "మమ్ములను ఆశ్రయించిన వారిని రక్షించుట మా ధర్మము. మీతో పోరునకు మేము సిద్ధము" అని కబురంపుతాడు. గండికోట కు మూడు క్రోసుల దూరమున గల కోమలి వద్ద తిమ్మరాజుకు, యెర్రతిమ్మానాయునికి మధ్య భీకర యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధములో విజయనగర సేన ఓడిపోతుంది. తిమ్మానాయుడు, రామరాయలు తిమ్మరాజుని విజయనగరము వరకు తరిమి చంపుతారు. ఈ యుద్ధపరిణామముగా రామరాయలు విజయనగర సామ్రాజ్యాధిపతి అవుతాడు<ref>కోమలి వద్ద యుద్ధం: http://books.google.co.in/books?id=FqLfdZ0gcoEC&pg=PA184&dq=gandikota&lr=#PPA184,M1</ref>.
 
==సుల్తానులతో సంబంధాలు==
"https://te.wikipedia.org/wiki/రామ_రాయ" నుండి వెలికితీశారు