శివాజీ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి విస్తరించాను
పంక్తి 1:
 
{{మొలక}}
'''శివాజీ''' తెలుగు సినిమా కి చెందిన ఒక నటుడు. ఆయన స్వస్థలం [[గుంటూరు జిల్లా]] [[గొరజవోలు]] అనే ఒక కుగ్రామం. మొదట బుల్లితెరపై యాంకర్ గా పనిచేశాడు. తరువాత చిన్న పాత్రల ద్వారా పరిశ్రమ లోకి వచ్చిన శివాజీ తరువాత హీరొగా నిలదొక్కుకున్నాడు. మొదట్లో ఏదైనా చిన్న ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిద్దామని హైదరాబాద్ కి వచ్చాడు. అప్పుడే కొత్తగా ప్రారంభమైన [[జెమినీ టివి]] లో వీడియో ఎడిటర్ గా చేరాడు. కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య అక్కడే యాంకర్ గా మారాడు.
 
[[కె. రాఘవేంద్ర రావు]] 2000 సంవత్సరంలో తను చేయబోయే కొత్త సినిమా [[పరదేశి]] అనే సినిమా కోసం నూతన నటీనటుల కోసం ''స్టార్ 2000 కాంటెస్ట్'' అనే ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో [[లయ]], శివాజీ రెండో స్థానంలో నిలిచారు. విచిత్రమేమిటంటే మొదటి స్థానంలో నిలిచిన వారు పరదేశి సినిమాలో కనిపించిన తరువాత మరే సినిమాలలోనూ కనిపించలేదు. కానీ ఆ షో వల్ల శివాజీ గురించి పదిమందికి తెలిసింది. దాంతో నెమ్మదిగా సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.
 
డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు దగ్గర ఎడిట్ సూట్ లో పనిచేశాడు. అప్పుడే సినిమాలని నిశితంగా పరిశీలించడం నేర్చుకున్నాడు. శివాజీ నటించిన సినిమాల్లో మొదట విడుదలైంది. [[చిరంజీవి]] హీరోగా నటించిన [[మాస్టర్]] అనే సినిమా.<ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక లో ప్రచురితమైన శివాజీ ఇంటర్వ్యూ ఆధారంగా </ref> కానీ తొలి అవకాశం ఇచ్చింది మాత్రం వైవీయస్ చౌదరి. ఆ సినిమా ''సీతారాముల కల్యాణం చూతము రారండి'' అందులో శివాజీది హీరో స్నేహితుడి పాత్ర.. ఆ సినిమా కోసం ఆయన మొట్టమొదటి సారిగా విమానమెక్కి విదేశం (దుబాయ్) వెళ్ళాడు.
 
సినిమాల్లో ఆయన తొలి సంపాదన పదిహేను వేల రూపాయలు. మాస్టర్ సినిమాకు పనిచేస్తే వచ్చిన డబ్బులవి. అందరు మధ్య తరగి కుర్రాళ్ళలానే ఆయన ఆ డబ్బుతో వాళ్ళ అమ్మకు బంగారం కొన్నాడు.
 
;శివాజీ హీరో గా నటించిన కొన్ని చిత్రాలు
Line 8 ⟶ 14:
*[[టాటా బిర్లా మధ్యలో లైలా]]
*[[స్టేట్ రౌడి]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/శివాజీ_(నటుడు)" నుండి వెలికితీశారు