విల్ డ్యురాంట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==బోధనాచార్యుడు==
తల్లి కోరిక ప్రకారము మతబోధకుడుగా శిక్షణ పొందవలెనని డ్యురాంట్ ఆశయము. కాని భవిష్యత్ లో ఒక గొప్ప తత్వవేత్తగా మారాడు. 1905లో సామ్యవాదమును మధించి అన్ని రాజకీయ పంథాల వెనుక అధికారవ్యామోహము నిద్రాణమై ఉంటుందని తేల్చాడు. 1907లో పట్టభద్రుడయ్యాడు. న్యూయార్క్ ఈవెనింగ్ జర్నల్ కు లేఖకునిగా వారానికి పది డాలర్ల జీతానికి కుదురుకున్నాడు. లైంగిక నేరములపై పలు వ్యాసాలు వ్రాశాడు. తరువాత న్యూజెర్సీ లోని సేటన్ హాల్ విశ్వవిద్యాలయములో ఆంగ్లము, లాటిన్, ఫ్రెంచ్ భాషల బోధకునిగా చేరాడు. అచటనే గ్రంథాలయాధికారిగా కూడ పని చేశాడు. 1911లో ఫెర్రర్ మోడర్న్ పాఠశాలలో బోధకునిగా చేరాడు. అచటనే తన జీవిత సహధర్మచారిణి ఛాయ కాఫ్ మన్ తటస్థపడింది. తన కన్నా 13 ఏండ్లు చిన్నదగు విద్యార్ధిని ఛాయకు అరియల్ అని పేరు పెట్టాడు.
 
డ్యురాంట్ తన జీవిత మూడవ దశకములో ప్రేమ, తత్వశాస్త్రము, క్రైస్తవము, సామ్యవాదము కలగలిసిన ఒక విచారధారను రూపొందించాడు. 1913లో అధ్యాపక పదవి వదలి స్థానిక ప్రెస్బిటీరియన్ చర్చ్ లో 10 డాలర్ల చొప్పున ఉపన్యాసములు ఇచ్చుట మొదలుపెట్టాడు. ఈ ఉపన్యాసముల విషయములే భవిష్యత్ లో రాబోవు 'The Story of Civilization' కు ఆధారాలు.
==తాత్వికుడు==
 
1917లో తత్వశాస్త్రములో పి.హెచ్.డి పట్టా పొందాడు. తత్వశాస్త్రము-సాంఘిక సమస్య అను గ్రంథము వ్రాశాడు. తరువాత కొలంబియా విశ్వవిద్యాలయములో బోధకునిగా చేరాడు.
==రచయిత==
డ్యురాంట్ వ్రాసిన ముఖ్య గ్రంథాలు:
 
'''తత్వశాస్త్ర కథ'''(The Story of Philosophy): ఇది చిన్న నీలపు రంగు పుస్తకాల మాలిక గా ప్రారాంభమై, విపరీతమగు ప్రజాదరణ పొంది 1926లో ఒకే పుస్తకముగా ప్రచురింపబడింది. ఈ పుస్తకము ద్వారా సంపాదించిన ధనముతో డ్యురాంట్ దంపతులు పలు దేశాలు పర్యటించి నాలుగు దశాబ్దాలు అవిశ్రాంతముగా 'సంస్కృతి-ఇతిహాసము' (The Story of Civilization) వ్రాయుటకు తోడ్పడింది. బోధనా వ్యాసంగము వదిలి పదకొండు సంపుటముల బృహత్ గ్రంథము వ్రాయబూనాడు.
==పుస్తకాలు==
 
'''సంస్కృతి-ఇతిహాసము''':
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/విల్_డ్యురాంట్" నుండి వెలికితీశారు