శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం
పంక్తి 1:
'''శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం''' కలియుగ వైకుంఠపతి శ్రీ వేంకటేశ్వరుని [[సుప్రభాత సేవ]]లో కీర్తించే [[స్తోత్రము]]. "సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" (Good Morning) అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవ ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు. తిరుమల శయనమంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తఅరు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. 1430 సంవత్సరంలో శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠవంతోపాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. అప్పటినుండి అవిచ్ఛిన్నంగా (అంటే 580 సంవత్సరాలుగా) ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.
 
 
 
 
సంస్కృతంలో ఉన్న ఈ ప్రార్ధన తెలుగునాట, మరియు ఇతర హిందువులలోను అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రార్ధనా గీతాలలో ఒకటి. అనేక వెంకటేశ్వరస్వామి మందిరాలలోను, ఇండ్లలోను ఈ సుప్రభాతాన్ని చదివే, వినే ఆచారం ఉంది. చాలా శైవ, వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నాగాని "సుప్రభాతం" అనగానే వెంకటేశ్వర సుప్రభాతం స్ఫురణకు రావడం కద్దు.