డి. కె. అరుణ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ రాజకీయనేతలలో ప్రముఖురాలైన డి.కె.అ…
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[మహబూబ్ నగర్ జిల్లా]] నడిగడ్డ రాజకీయనేతలలో ప్రముఖురాలైన డి.కె.అరుణ [[గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి వరుసగా రెండో సారి ఎన్నిక అవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల నంతరం [[వై.ఎస్.రాజశేఖర రెడ్డిరాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించింది. పుట్టినిల్లు మరియు మెట్టినిల్లు రెండూ రాజకీయాలలో పేరుపొందినవే. తండ్రి మరియు సోదరుడు ఇదివరకు [[మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి గెలుపొందగా, మామ మరియు భర్త గద్వాల నుంచి ఎన్నికైనారు. మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి ఒకసారి, గద్వాల అసెంబ్లీకి రెండు సార్లు ఓడిపోయిననూ [[2004]]లో తొలిసారి గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టగా మళ్ళీ [[2009]]లో రెండో సారి విజయం సాధించి ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009</ref> నియమించబడింది.
==బాల్యం, కుటుంబం==
డి.కె.అరుణ [[1960]], [[మే 4]]న మహబూబ్ నగర్ జిల్లా [[ధన్వాడ]]లో జన్మించింది. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ శాసనసభ్యుడిగా ఉంటూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు [[నారాయణపేట]]లో నక్సలైట్ల కాల్పులకు గురై మరణించాడు. సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా చిట్టెం నర్సిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొంది శాసనసభలో ప్రవేశించాడు. భర్త డి.కె.భరతసింహారెడ్డి, మామ డి.కె.సత్యారెడ్డిలు కూడా పేరుపొందిన రాజకీయనేతలు. వీరిరువురూ గతంలో గద్వాల నుంచే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.
"https://te.wikipedia.org/wiki/డి._కె._అరుణ" నుండి వెలికితీశారు