"వైఎస్‌ఆర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
* రెవెన్యూ డివిజన్లు (3): కడప, రాజంపేట, జమ్మలమడుగు
* [[లోక్‌సభ]] స్థానాలు (2): కడప, రాజంపేట
* [[శాసనసభ]] స్థానాలు (11): [[కోడూరు]], [[రాజంపేట]], [[రాయచోటి]], [[లక్కిరెడ్డిపల్లె]] (పునర్విభజనలో ఈ నియోజకవర్గము రద్దు చేయబడినది.), కడప, [[బద్వేల్]], [[మైదుకూరు]], [[ప్రొద్దుటూరు]], [[జమ్మలమడుగు]], [[కమలాపురం]], [[పులివెందుల]].<br /> కడప జిల్లాను గతంలో హిర్యణ రాజ్యం అని వ్యవహరించేవారు.
 
==భౌగోళికము==
 
==చరిత్ర==
కడప జిల్లా చరిత్ర చాలా ప్రాచీనమైనది. కడప జిల్లాను గతంలో హిర్యణ రాజ్యం అని వ్యవహరించేవారు. క్రీ.పూ. 274-236 ప్రాంతంలో [[అశోక చక్రవర్తి]] ఈ ప్రాంతాన్ని పాలించాడు.ఆ తరువాత [[శాతవాహనులు]] పాలించారు. శాతవాహనుల నాణేలు [[పెద్దముడియం]], [[దానవులపాడు]] గ్రామాల్లో దొరికాయి. క్రీ.శ. 250-450 ప్రాంతంలో [[పల్లవరాజులు]] పాలించారు. ఇంకా [[రాష్ట్రకూటులు]], [[చోళులు]], [[కళ్యాణి చాళుక్యులు]], [[వైదుంబులు]], [[కాకతీయులు]] మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. క్రీ.శ. 1336-1565 కాలంలో విలసిల్లిన [[విజయనగర సామ్రాజ్యం]]లో కడప జిల్లా ఒక భాగం. [[గండికోట]] ను పాలించిన [[పెమ్మసాని నాయకులు]] విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులుపొందారు. [[నంద్యాల]] రాజులు, [[మట్లి రాజులు]] కూడ ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. విజయనగర పతనం తర్వాత [[గోల్కొండ]] నవాబులు, [[బీజాపూరు]] సుల్తానులు, [[ఔరంగజేబు]] మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు. క్రీ.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. నవాబుల తర్వాత పాళెగాళ్ళు విజృంభించారు.
 
ఆ తరువాత [[ఈస్టిండియా కంపెనీ]] ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్ [[థామస్ మన్రో]] కడప జిల్లా కలెక్టరు గా పని చేశాడు. [[పాలెగాళ్ళు|పాలెగాళ్ళ]]ను అణచాడు. [[రైత్వారీ విధానం|రైత్వారీ విధానాన్ని]] ప్రవేశపెట్టాడు. ఈ ప్రాంతపు అభివృద్ధికి తెల్లదొరలు కొంతవరకు కృషి చేశారు. మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. [[సి.పి.బ్రౌన్]] తెలుగుభాషను సముద్ధరించాడు. [[మనుచరిత్ర]], [[వసుచరిత్ర]] వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా [[వేమన]] పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక [[మెకంజీ|కల్నల్ మెకంజీ]] గ్రామాల చరిత్రను సేకరించి [[కైఫీయతులు|కైఫీయతుల]] పేరుతో భద్రపరిచాడు.
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/414469" నుండి వెలికితీశారు