ఇల్లరికం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 86:
==విశేషాలు==
 
* ఇది అక్కినేనికి 74వ సినిమా. ఇందులో కె. ప్రత్యగాత్మ, కోగంటి గోపాలకృష్ణలు, తాతినేని రామారావులు సహాయ దర్శకులుగా పని చేశారు. తరువాత వారంతా ప్రసిద్ధ దర్శకులయ్యారు.
 
* సురభి కమలాబాయి చాలాకాలం తరువాత మళ్ళీ సినిమాలో నటించింది.
 
* ఆరుద్ర డైలాగులు చిత్ర విజయానికి బాగా తోడ్పడినాయి. పోస్టరులపై బాపు కార్టూనులు తెలుగు సినిమా రంగంలో క్రొత్త ట్రెండ్‌గా చెప్పారు.
 
* ''నిలువవే వాలు కనుల దానా'', ''నేడు శ్రీవారికి మేమంటే పరాకా'' వంటి పాటలు ఎవర్‌గ్రీన్ పాటలుగా ప్రసిద్ధి చెందాయి. 50 యేళ్ళ తరువాత కూడా ఈ పాటలు శ్రోతలనోట నానుతున్నాయి. గోపీచంద్ హీరోగా వచ్చిన "లక్ష్యం" సినిమాలో "నిలువవే వాలుకనుల దానా" పాటను రి-మిక్స్ చేశారు.
 
* ఈ సినిమా 23 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
 
* ఎల్.వి.ప్రసాద్ ఈ సినిమాను హిందీలో "ససురాల్" అనే సినిమాగా పునర్నిర్మించాడు. అది పెద్ద విజయం సాధించింది. హిందీలో కూడా జమునను కధానాయికగా పెట్టాలనుకొన్నారుగాని కొన్ని కారణాల వలన చివరి క్షణంలో బి. సరోజాదేవిని ఆ పాత్రకు ఎంపిక చేశారు. అందుకు ప్రతిగా జమునకు ఐదు సినిమాలలో హీరోయిన్ పాత్ర ఇచ్చారట.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం_(సినిమా)" నుండి వెలికితీశారు