"బి.నాగిరెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

చి
({{దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు}} చేర్చాను)
ముద్రణ, ప్రచురణ, సినిమా రంగాల నుంచీ; ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలనుంచీ ఎన్నో అవార్డులూ, సత్కారాలూ ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. విశ్వవిద్యాలయాలు గౌరవడాక్టరేట్లతో సత్కరించాయి.
==చిత్రరంగంలో==
మొదట్నుంచి నాగిరెడ్డికి పబ్లిసిటీ విభాగం పట్ల ఆసక్తి ఉండేది. ఆయన తన అన్నగారైన [[బొమ్మిరెడ్డి_నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]] స్థాపించిన [[వాహినీ పిక్చర్స్|వాహినీ సంస్థ]]లో భాగస్వామిగా చేరాడు. రెండవప్రపంచయుద్ధ కాలంలో ([[1941]]లో) వాళ్ళ సరుకు తీసుకువెళ్తున్న ఓడ బాంబుదాడిలో ధ్వంసం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఆ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించలేక తన స్వగ్రామమైన ఓరంపాడు చేరాడు. ఆ తర్వాత వాహినీ వారి [[భక్తపోతన]] కు దర్శకత్వం వహించిన [[కె.వి.రెడ్డి]] నాగిరెడ్డిని మద్రాసుకు పిలిపించి ఆ చిత్రం తాలూకు పబ్లిసిటీ వ్యవహారాలు అప్పజెప్పాడు. సరిగ్గా అదే సమయంలో [[జెమినీ_పిక్చర్స్|జెమినీ]] వారి [[బాలనాగమ్మ]] విడుదలైంది. జెమినీ వారు తమ చిత్రాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తారు. దానికి దీటుగా ఉండడానికి నాగిరెడ్డి మద్రాసులో హనుమంతుడి భారీ కటౌట్లు పెట్టించి వినూత్న రీతిలో ప్రచారం చేయించాడు. ఆ పబ్లిసిటీ చిత్ర విజయానికి బాగా తోడ్పడింది. దాంతో కె.వి.రెడ్డి ఆయనకు 500 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. ఆ మొత్తంతో నాగిరెడ్డి ఒక ఆస్టిన్ కారు కొన్నాడు.
 
===విజయా సంస్థ===
తర్వాత తమ సంస్థలో దర్శకత్వశాఖలో సహాయదర్శకుడుగా పనిచేస్తున్న [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకత్వంలో 1954లో '''[[చంద్రహారం]]''' తీశారు. ఇది గొప్ప చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు.
 
ఆ తర్వాత వారు తీసిన సినిమాలే నేటికీ తెలుగులో వినోదాత్మక సాంఘిక చిత్రాల్లో మేటిగా కీర్తించబడే '''[[మిస్సమ్మ]]''', దాని తర్వాత '''[[మాయాబజార్]]'''. నిస్సందేహంగా ఇది ప్రపంచస్థాయి చిత్రం. వీటి తర్వాత వచ్చిన రెండు విజయవంతమైన విజయావారి సినిమాలు '''[[అప్పు చేసిఅప్పుచేసి పప్పుకూడు]]''', '''గుండమ్మ కథ'''. గుండమ్మ కథతో ఒక శకం ముగిసినట్లైంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ - ఆఖరుకు విజయావారి తర్వాతి సినిమాలు కూడా - ఆ స్థాయిని అందుకోలేకపోయాయి.
 
విజయావారి ఇతర సినిమాలు:
[[సి.ఐ.డి.]]
 
[[జగదేకవీరుని కథ]]
[[జగదేకవీరునికథ]]
 
[[సత్య హరిశ్చంద్ర]]
[[సత్యహరిశ్చంద్ర]]
 
[[ఉమా చండీ గౌరీ శంకరుల కథ]]
 
[[గంగ_మంగ|గంగ - మంగ]]
 
[[శ్రీరాజేశ్వరీవిలాస్శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్]] మొదలైనవి.
 
చక్రపాణి మరణం తర్వాత సినిమాలు తీయడం మానుకున్న నాగిరెడ్డి ఆ తర్వాత చాలా కాలానికి 1990లలో విజయా బ్యానర్ మీదే "[[విజయ]]" అనే సినిమా తీశాడు. దీంట్లో [[రజనీకాంత్]] నటించాడు.
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/418693" నుండి వెలికితీశారు