"దక్షిణామూర్తి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{అయోమయం}}
'''దక్షిణామూర్తి''' [[శివుడు|పరమశివుని]] జ్ఞానగురువు అవతారం. ఇతర [[గురువు]]లు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి [[మౌనం]]గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
 
సనకసనందాది మునీంద్రులు చాలాకాలం తపస్సు చేసి కూడా బ్రహ్మతత్త్వాన్ని నిర్ణయించుకోలేకపోయారు. బ్రహ్మదేవుని అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్ళారు. అక్కడ చతుర్ముఖుడు సరస్వతీ సమేతుడై ఉండడం చూచి వెనుదిరిగారు. వైకుంఠానికి పోగా అక్కడ మహావిష్ణువు లక్ష్మీ సమన్వితుడై కనిపించాడు. ఆ దేవుని మీద కూడా వారికి విశ్వాసం కలుగలేదు. ఆ తరువాత వారు కైలాసానికి వెళ్ళారు. అక్కడ వటవృక్షం క్రింద వ్యాఘ్రాసనాసీనుడై శుద్ధ జ్ఞానైక ముర్తిగా శివుడు సాక్షాత్కరించాడు. ఆ మూర్తియే దక్షిణామూర్తి. ఆయనను దర్శించి తమకు సరియైన గురువు లభించాడని సంతుష్టులై ఆదిదేవునికి శిష్యత్వం వహించారు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/419075" నుండి వెలికితీశారు