గాలిపటం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: lt:Aitvaras (įtaisas)
పంక్తి 17:
గాలిపటాలను గాలిలో తేలికగా ఎగరటానికి అనువైన కాగితం లేదా పట్టు(సిల్క్) వస్త్రము లాటివాటితో చేస్తారు.ఒకటి లేదా రెండు వెదురు లేదా కోబ్బరి ఈనెల లాటి పుల్లలను తెర`చాప ఆదారాల మాదిరిగా అమర్చి కాగితాన్ని అతికించి పుల్ల మద్యలో దారం (సూత్రం) కడితే గాలి పటంతాయారు అవుతుంది, గాలిలో నియంత్రణకలిగి ఉంటానికి తోకని కూడా అమర్చటం కద్దు. సాంప్రదాయకంగా గాలిపటాలలో కొబ్భరి ఈనె, వెదురు బద్ద లేదా పేము లాంటి తేలిక పాటి వంగే గుణంవుండే పుల్లలను ఆదారాలుగా, కాగితాన్ని ఎగురటకు తోడ్పడే తెర లాగా వాడతారు. ఆయితే నవీన పద్దతుల లో గాలి పటాలని ఉలిపిరి పొరలవంటి (ఫాయిల్ )తెరలను ఉపయోగించి ఏవిదమయిన ఆదారాలు లేకుండానే తయారు చేస్తున్నారు.కొన్నిసార్లు తెరలకి ఆకర్షణీయమైన ఫైబర్-గ్లాస్ (కృత్రిమమైన నారతో చేసే గాజు ),కార్బన్-నార లాంటి వాటిని తెరలుగా, డెక్రాన్ లేదా డైనీమా లాంటి కృత్రిమ పదార్దాలని ఆదారాలుగా వాడుతున్నారు. గాలిపటాలను మామూలు దారం లేదా ట్వయిన్-దారంతొ ఎగరవేయిటం జరుగుతుంది.కొన్నిసార్లు వేరే గాలిపటాల దారాన్ని తెంచటానికి గాజుపిండిని దారానికి పూయటం జరుగుతుంది.
 
గాలిపటాలని అనేక ఆకారాలలో తయారు చేయవచ్చు, ఆధునిక పద్దతులలో థ్రీడైమన్ష్న్ గాలిపటాలను ఉబ్బేపొరల (ఇన్ఫ్లేటబుల్) తో ఎటువంటి ఆదారాలు లేకుండా తయారు చేస్తున్నారు, ఆయితే మాములుగా పిల్లలు ఆడుకునే గాలిపటాలు రేఖీయ (చతురస్ర, డైమండ్ మొదలగు )నమూనాలను పోలి వుంటాయి. ఆసియా ఖండంలో పిల్లలు ఇట్లోవాడే టావులుఠావులు, వార్తాపత్రికలు లేదా ఎండిన ఆకులకు కుట్టుడు దారంతో సూత్రంకట్టి ఆడుకోవటంకద్దు.[ఆధారం కోరబడినది]
 
గాలిపటాలను మామూలుగా ఎగిరే కీటకాలు, పక్షులు, జంతువులు మొదలైన రూపాల్లో తయారు చేస్తుంటారు. మంచి నాణ్యత కలిగిన చైనా గాలిపటాలను చీల్చిన [[వెదురు]] బద్దలఆదారాలతో పట్టువస్త్రం ఉపయోగించి తయారు చేసి హస్తకళాచిత్రాలతో అలంకరిస్తారు. తక్కువ కర్చుతో పెద్దయెత్తున ఉత్పత్తి చేసే గాలిపటాలను ప్రింటెడ్-పాలిస్ఠర్పాలిస్టర్ తో తయారు చేస్తారు. పెద్దపెద్దగాలిపటాలను మడతపెట్టటానికి వీలుగా గుడిదే(కీలు, హింజ్ )లతో తయారుచేస్తారు. ఎటుచూసినా ఒకేమాదిరిగా ఉండే గాలిపటాల ముక్కును గాలివీచేదిశలో వుంచటానికి తోకను వాడతారు, దృశ్యసహాయకాలుగా తిరిగే చక్రాలని (స్పిన్నర్స్ ), స్పిన్ సాక్స్ లని వాడతారు .గాలిపటాలను సమాచారాన్నిచూపించుటకు కూడా వుపయోగిస్తారు, ఇలాంటి గాలిపటాలలో పెద్ద పెద్ద స్పిన్నర్స్, స్పిన్ సాక్స్ 15మీ|| (50 అడుగుల) వరకూ వుంటాయి. ఆధునిక గాలిపటాలు అనేక వంపులతో గాలిలో కచ్చితమయిన నియంత్రణ కలిగి వుంటాయి. కొన్నిగాలిపటాలలో అత్యవసరంగా గాలిపటాన్ని ఎగరవేసేవారినుంచీ విడదీయటానికి ఎర్పాటు వుంటుంది.
 
==పతంగి పోటీలు==
"https://te.wikipedia.org/wiki/గాలిపటం" నుండి వెలికితీశారు