గిరిజా షెత్తర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
గిరిజ చెన్నైలో మణిరత్నం మరియు సుహాసినిల పెళ్ళికి క్రికెట్ ఆటగాడు శ్రీకాంత్ యొక్క చెల్లెలితో వచ్చింది. పెళ్ళిలో ఆమెను చూసిన మణిరత్నం, తను తీయబోయే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. సీనియర్ అసోషియేట్ డైరెక్టరైన గాదిరాజు కేశవరావుతో ఆమెకు షూటింగుకు ముందు రెండు నెలలపాటు శిక్షణ ఇప్పించారు. సంభాషణలను ఇంగ్లీషులో వ్రాసుకొని ఈమె కేశవరావుతో కలిసి ప్రాక్టీసు చేసింది. ఆ తరువాత గిరిజ, ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన వందనం అనే మళయాళం సినిమాలోనూ హృదయాంజలి అనే తెలుగు చిత్రంలోనూ నటించింది. హృదయాంజలి 1992లో పూర్తయినా 2002లో విడుదలైంది. ఈ సినిమాలో గిరిజ సరసన సంజయ్ మిత్రా నటించాడు. ఏ.రఘురామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎల్.వైద్యనాథన్ సంగీతము, మధు అంబట్ ఛాయాగ్రహణము సమకూర్చారు. హృదయాంజలి నాలుగు నంది అవార్డులను అందుకున్నది. ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు యేసుదాసు పాడిన మంచిన పాటలున్నా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేదు. గిరిజి జో జీతా వహీ సికందర్ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటు స్టేజిపై డ్రామా వేసే సన్నివేశంలో ఒక పాటలో కనిపించింది. ఈ సినిమాకు మొదట కథానాయిక పాత్రకు గిరిజను ఎంపిక చేసుకున్నారు. కానీ ఎందుకనో మొదటి షెడ్యూలు తర్వాత ఈమె స్థానంలో ఆయేషా జుల్కాను తీసుకున్నారు.<ref>http://www.telugucinema.com/c/publish/movieretrospect/retrospect_geetanjali_1989.php</ref> ఆ తర్వాత గిరిజ లండన్ కు తిరిగి వెళ్లిపోయింది. గిరిజ ప్రస్తుతము రచయితగా లండన్లో స్థిరపడింది. ఈమె నటనపై ఇప్పటికీ తన అధ్యయనము కొనసాగిస్తూ ఇతర నటులు మరియు సినీ నిర్మాతలతో పనిచేస్తూనే ఉన్నది.
 
==గిరిజ నటించిన తెలుగు చిత్రాలు==
*[[గీతాంజలి (1989 సినిమా)|గీతాంజలి]]
*వందనం (మలయాళం)
"https://te.wikipedia.org/wiki/గిరిజా_షెత్తర్" నుండి వెలికితీశారు