వానపాము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: gan:寒筋子
చి యంత్రము కలుపుతున్నది: th:ไส้เดือนดิน; cosmetic changes
పంక్తి 23:
'''వానపాములు''' (Earthworms) [[అనెలిడా]] వర్గానికి చెందిన జీవులు. వీటిని [[ఆలిగోకీటా]] తరగతిలో [[లుంబ్రిసినా]] ఉపక్రమంలో ఉంచారు. విశ్వవ్యాప్తంగా ఆలిగోకీటాకు చెందిన 3,100 జాతులను గుర్తించగా అందులో 1,800 జాతుల వానపాములున్నాయి. వీనిలో 40 జాతులు భారతదేశంలో ఉన్నాయి. మనదేశంలోని వానపాముల్లో దక్షిణ భారతదేశంలోని [[ద్రవిడా గ్రాండిస్]] (Drawida grandis) అతి పెద్ద వానపాము. ఇవి నేలను సారవంతం చేసి వ్యవసాయానికి సహాయపడతాయి.
 
== వర్గీకరణ ==
=== ముఖ్యమైన కుటుంబాలు ===
*[[Acanthodrilidae]]<br />
*[[Criodrilidae]]<br />
పంక్తి 32:
*[[మెగాస్కోలిసిడే]]: [[ఫెరిటిమా]] ప్రజాతి వానపాములను [[భారతదేశపు వానపాము]]గా చెబుతారు.
 
== భారతదేశపు వానపాము ==
[[ఫెరిటిమా]] ప్రజాతికి చెందిన వానపాముల్ని భారతదేశపు వానపాములుగా గుర్తిస్తారు. ఇవి 13 జాతులున్నాయి. అందులో [[ఫెరిటిమా పోస్తుమా]] అనేది మనదేశంలో లభించే సాధారణ వానపాము.
 
ఫెరిటిమా పోస్తుమా ఎక్కువగా తేమగల నేలల్లో బొరియలు చేసుకొని నివసిస్తుంది. ఇవి కుళ్ళుతున్న జీవపదార్ధాలు, బంకమట్టి లేదా ఇసుక నేలల్లో ఉంటాయి. కాబట్టి ఆహారం దొరికే నేలపై పొరల్లోనే ఉంటాయి. వేసవికాలంలో నేల పొడిగా ఉండటం వల్ల లోతుగా బొరియలు చేసుకొని జీవిస్తుంది. వర్షం కురిసి బొరియలు నీటితో నిండినప్పుడు ఇవి బయటకు వస్తాయి. వీటి ఉనికిని అది నేలమీద విడుదలచేసే క్రిమి విసర్జనాల సహాయంతో గుర్తుపట్టవచ్చును. ఇవి నిశాచర జీవులు.
 
వీని దేహం స్థూపాకారంగా సుమారు 150 మి.మీ. పొడవు మరియు 3-5 మి.మీ. వ్యాసాన్ని కలిగివుంటుంది. ఉదరతలం కంటే పృష్ఠతలం [[ప్రార్ఫిరిన్]] (Porphyrin) అనే పదార్ధం ఉండటం వలన ముదురు రంగులో ఉంటుంది. ఇది వానపామును అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి రక్షిస్తుంది. వానపాము పూర్వాంతం మొనదేలి ఉండగా పరాంతం మొండిగా ఉంటుంది. పూర్వాంతంలో నోటి రంధ్రం ఉంటుంది. దేహమంతా వలయాకారపు ఖండితాలు 100 నుండి 120 వరకు ఉంటాయి. చివరి ఖండితంలో పాయువు ఉంటుంది. వానపాములో ప్రతి ఖండితం మధ్య కైటిన్ తో చేసిన శూకాలు ఖండితం చుట్టూ ఉంటాయి. ఈ రకమైన శూకాల అమరికను పెరికీటైన్ అమరిక అంటారు.
 
[[వలయ కండరాలు]] ఏకాంతర సంకోచ వ్యాకోచాలు జరుపుతూ వానపాము గమనాన్ని జరుపుతుంది. శూకాలు, శరీర కుహరద్రవం గమనంలో సహకరిస్తాయి. గమనం జరుపుతున్నపుడు విస్తరణ (Extention), లంగరు (Anchoring), సంకోచం (Contraction) అనే మూడు ప్రక్రియలు వానపాము దేహంలో జరుగుతాయి.
 
== ఆర్ధిక ప్రాముఖ్యం ==
వానపాములు మానవుల కెంతో ఉపయోగకరమైనవి. [[చేప]]లకు ఎరగాను, అక్వారియమ్ లో చేపలకు, భూమి మీద [[కప్పలు]], [[తొండలు]], పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి.
 
పంక్తి 47:
 
== ఇవి చదవండి ==
Edwards, Clive A. (Ed.) ''Earthworm Ecology''. Boca Raton: CRC Press, 2004. Second revised edition. ISBN 084931819X0-8493-1819-X
 
Lee, Keneth E. ''Earthworms: Their Ecology and Relationships with Soils and Land Use''. Academic Press. Sydney, 1985. ISBN 0-12-440860-5
 
Stewart, Amy. ''The Earth Moved: On the Remarkable Achievements of Earthworms''. Chapel Hill, N.C.: Algonquin Books, 2004. ISBN 1-56512-337-9
 
 
[[వర్గం:అనెలిడా]]
Line 88 ⟶ 87:
[[sk:Dážďovky]]
[[sv:Daggmask]]
[[th:ไส้เดือนดิน]]
[[tl:Bulateng lupa]]
[[vi:Giun đất]]
"https://te.wikipedia.org/wiki/వానపాము" నుండి వెలికితీశారు