"వామనావతారము" కూర్పుల మధ్య తేడాలు

చి (యంత్రము కలుపుతున్నది: ms:Wamana)
అది పాపము కాదు. అని శుక్రాచార్యుడు వివరించెను. దానికి బలి చక్రవర్తి ..కారే రాజులు రాజ్యముల్‌ కలుగవే, గర్వోన్నతింబొందరే వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనంగలదే! శిబి లాంటి దాతల పేరు ఈనాటికీ స్థిరములైనవి కదా! భార్గవా! అని పలుకుతూ తన మాటను తోసి పుచ్చిన రాజును పదభ్రష్ఠునివి గమ్మని శుక్రాచార్యుడు శపించాడు.
== శుక్రాచార్యుడు ఏకాక్షుడగుట==
అయినను బలిచక్రవర్తి హరిచరణములు కడిగి, త్రిపాద ధరిణిం దాస్యామి అనుచు నీటిధార విడిచాడు. ఆ కలశములో సూక్ష్మకీటక రూపమున చేరి శుక్రాచార్యుడు నీటిధారను ఆపబోయాడు. అప్పుడు హరి కుశాగ్రముతో కలశరంధ్రమును బొడువగా [[కన్ను]] పోగొట్టుకొని శుక్రాచార్యుడు ఏక నేత్రుడయ్యెను. ''పుట్టి నేర్చుకునెనో, పుట్టక నేర్చెనో.. ఈ పొట్టి వడుగునకీ చిట్టి బుద్ధులెట్లబ్బెనో, ఈతని పొట్టనిండా అన్నీ భూములే..'' అని నవ్వుతూ మూడడుగుల నేలను బలి వడుగుకు దానమిచ్చెను.
 
==ఇంతింతై...వటుడింతయై==
అలా ధారా పరిగ్రహంబు చేసి, ఇంతితై వటుడింతయై, మరియు దానింతై, నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశి పైనంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటి పైనంతై, బ్రహ్మాండాంత సంవర్థియై, సత్యపదోన్నతుడైన విష్ణువునకు అప్పుడే ఉదయించిన సూర్యబింబము మొదట గొడుగులా, తదుపరి శిరోరత్నమై, చెవి కుండలమై, మెడలోని ఆభరణమై, బంగారు కేయూరమై, కంకణమై వడ్డాణపు ఘంటమై, నూపురప్రవరమై, చివరకు పాదపీఠమై ఒప్ప అతడు బ్రహ్మాండము నిండినాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/425419" నుండి వెలికితీశారు