91,609
దిద్దుబాట్లు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
==ఇంతింతై...వటుడింతయై==
అలా ధారా పరిగ్రహంబు చేసి, ఇంతితై వటుడింతయై, మరియు దానింతై, నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశి పైనంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటి పైనంతై, బ్రహ్మాండాంత సంవర్థియై, సత్యపదోన్నతుడైన విష్ణువునకు అప్పుడే ఉదయించిన సూర్యబింబము మొదట గొడుగులా, తదుపరి శిరోరత్నమై, చెవి కుండలమై, మెడలోని ఆభరణమై, బంగారు కేయూరమై, కంకణమై వడ్డాణపు ఘంటమై, నూపురప్రవరమై, చివరకు పాదపీఠమై ఒప్ప అతడు బ్రహ్మాండము నిండినాడు - అని [[బమ్మెర పోతన]] [[భాగవతం]]లో పద్య రచన అద్భుతంగా చేశాడు.
==మూడో అడుగు==
ఒక పాదంబులో భూమిని కప్పి, దేవ లోకమును రెండవ పాదమున నిరోధించి, జగములెల్ల దాటి చనిన త్రివిక్రముడు మరల వామనుడై బలినవలోకించి నా మూడవ పాదమునకు స్థలము జూపమన్నాడు. అప్పుడు బలి వినయముతో నీ తృతీయ పాదమును నా శిరమున ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి, ప్రహ్లాదునితో సుతలలోకమునకు పంపి, తానే ఆలోకమునకు ద్వారపాలకుడాయెను. బలి నడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రున కిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి.
|