శివాజీ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 5:
డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు దగ్గర ఎడిట్ సూట్ లో పనిచేశాడు. అప్పుడే సినిమాలని నిశితంగా పరిశీలించడం నేర్చుకున్నాడు. శివాజీ నటించిన సినిమాల్లో మొదట విడుదలైంది. [[చిరంజీవి]] హీరోగా నటించిన [[మాస్టర్]] అనే సినిమా.<ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక లో ప్రచురితమైన శివాజీ ఇంటర్వ్యూ ఆధారంగా </ref> కానీ తొలి అవకాశం ఇచ్చింది మాత్రం వైవీయస్ చౌదరి. ఆ సినిమా ''సీతారాముల కల్యాణం చూతము రారండి'' అందులో శివాజీది హీరో స్నేహితుడి పాత్ర.. ఆ సినిమా కోసం ఆయన మొట్టమొదటి సారిగా విమానమెక్కి విదేశం (దుబాయ్) వెళ్ళాడు.
 
స్వతహాగా చిరంజీవి అభిమానియైన శివాజీ ఆయన్ను కలవాలని ఆశగా ఉండేది. ఆ కోరిక మాస్టర్ సినిమాతో తీరింది. ఈ సినిమాలో శివాజీ ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా కనిపిస్తాడు. కనీసం బూట్లు కూడా కొనుక్కోలేని పేదరికంలో ఉంటే చిరంజీవి అతన్ని ప్రోత్సహిస్తాడు. నిజజీవితంలో కూడా చిరంజీవి లాంటి పెద్ద మనసున్న వాళ్ళు తనను అలాగే ప్రోత్సహించారని వినమ్రంగా చెబుతాడు శివాజీ. హీరో అవ్వాలనే సినిమా రంగంలోకి రాలేదనీ వైవిధ్యభరితమైన ఏ పాత్ర రూపంలో అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నానని చెబుతాడు. శివాజీ. సినిమాల్లో ఆయన తొలి సంపాదన పదిహేను వేల రూపాయలు. మాస్టర్ సినిమాకు పనిచేస్తే వచ్చిన డబ్బులవి. అందరు మధ్య తరగి కుర్రాళ్ళలానే ఆయన ఆ డబ్బుతో వాళ్ళ అమ్మకు బంగారం కొన్నాడు.
 
 
;శివాజీ హీరో గా నటించిన కొన్ని చిత్రాలు
*[[మనసుంటే చాలు]]
*[[మిస్సమ్మ]]
*[[మంత్ర]]
"https://te.wikipedia.org/wiki/శివాజీ_(నటుడు)" నుండి వెలికితీశారు