మాగంటి బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ జరుగుతున్నది
పంక్తి 1:
{{మొలక}}
'''మాగంటి బాపినీడు''' స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అగ్రశ్రేణి నాయకుడు. తెలుగులో [[విజ్ఞాన సర్వస్వము|విజ్ఞాన సర్వస్వాన్ని]] "[[ఆంధ్ర సర్వస్వము]]" అన్న పేరుతో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రచురించాడు. [[ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం]] కోసం పోరాడిన తొలితరం నాయకులలో ఒకడు. ఇతని భార్య [[మాగంటి అన్నపూర్ణాదేవి]] కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది. ఆమె మంచి రచయిత్తి, సమాజ సేవిక.
 
 
 
ఇతని భార్య [[మాగంటి అన్నపూర్ణాదేవి]] కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది. ఆమె మంచి రచయిత్తి, సమాజ సేవిక.
బాపినీడు 1895లో ఆగష్టు 14న [[చాటపర్రు]] గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. [[కె. వెంకటరత్నంరెడ్డి]] వంటి సంఘసంస్కర్తల ప్రభావం, డాక్టర్ [[భోగిరాజు పట్టాభి సీతారామయ్య]] వంటి రాజకీయ నాయకుల ప్రభావం అతనిపై బలంగా పడింది. ముందు చూపు కలిగిన అతని కుటుంబం [[కలకత్తా]]లో అతని విద్యాభ్యాసానికి ఏర్పాటు చేసింది. అక్కడ అనేక రచయితల పరిచయం లభించింది. తరచు [[శాంతినికేతన్]] సందర్శించేవాడు. తరువాత అతను "ఇండియన్ డిఫెన్సు కార్ప్స్"లో చేరాడు. అలాంటి మిలిటరీ శిక్షణ పొందిన మొదటి ఆంధ్రుడు అతనే.
కలకత్తాలో అనేక సాస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. బెంగాల్ ఆంధ్రా అసోసియేషన్‌కు కార్యదర్శిగా పని చేశాడు. తరువాత అతను అన్నపూర్ణాదేవిని పెండ్లాడాడు.
 
 
"మల్లాది సత్యలింగం ప్రతిభా విద్యార్ధి" గా అతను [[అమెరికా]]లో ఉన్నత చదువులకు వెళ్ళాడు. అక్కడ "న్యూయార్క్ స్టేట్ కాలేజి ఆఫ్ అగ్రికల్చర్"లో బి.ఎస్‌సి చదివాడు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎస్‌సి పూర్తి చేశాడు. ప్రొఫెసర్ వెబర్ అనే పండ్ల నిపుణునివద్ద పని చేశాడు. కార్నెవెల్ విశ్వవిద్యాలయం స్కాలర్‌షిప్పు లభించింది.
కార్నెవెల్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వ్యవసాయక సంఘం (International Agricultural Society of the Cornwell University) కిఅ తను స్థాపకుడు మరియు మొదటి ప్రెసిడెంట్ కూడాను. కాలిఫోర్నియాలో హిందూస్తాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పని చేశాడు.
 
 
తరువాత బాపినీడు [[భారత దేశం]] తిరిగివస్తూ మధ్యలో [[జపాన్]] దేశాన్ని సందర్శించాడు. 1923లో [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీలో చేరాడు. కిసాన్ ఉద్యమం ప్రాంభించాడు. "ఆంధ్ర రైతు సభ" మొట్టమొదటి కార్యదర్శిగా పని చేశాడు. గోదావరి-కృష్ణా సెటిల్మెంట్ సెంట్రల్ కమిటీలో చురుకుగా పనిచేశాడు. కిసాన్ ఉద్యమాలు నడిపినందుకు ఆరు నెలలు జైలు శిక్ష అననుభవించాడు.
 
 
==బయటి లింకులు==
 
* http://www.kamat.com/database/biographies/bapineedu.htm బాపినీడు గురించి
* http://www.thehinduimages.com/hindu/photoDetail.do?photoId=2536278 హిందూలో బొమ్మ
* http://www.kamat.org/picture.asp?Name=c103.jpg మరొక బొమ్మ
 
* http://www.archive.org/details/AndhraSarvasvamu బాపినీడు ప్రచురించిన ఆంధ్ర సర్వస్వము
* http://yabaluri.org/TRIVENI/CDWEB/AnnapurnaDevi.htm మాగంటి అన్నపూర్ణాదేవి గురించి
 
 
[[వర్గం:1895 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/మాగంటి_బాపినీడు" నుండి వెలికితీశారు